Urvashivo Rakshashivo Collections: ‘ఊర్వశివో రాక్షశివో’ .. రెండో రోజు కూడా జస్ట్ ఓకె అనిపించింది!

‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘ఒక్క క్షణం’, ‘ఎబిసిడి’ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన అల్లు అరవింద్ గారి రెండో అబ్బాయి అల్లు శిరీష్ నవంబర్ 4న ‘ఊర్వశివో రాక్షశివో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.కళ్యాణ్ దేవ్ తో ‘విజేత’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. అను ఇమాన్యుల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో వెన్నెల కిషోర్, సునీల్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఊర్వశివో రాక్షసివో’ టీజర్, ట్రైలర్ లకు మంచి మార్కులే పడ్డాయి.

మొదటి రోజు ఈ మూవీ పర్వాలేదు అనిపించే విధంగా టాక్ ను సొంతం చేసుకుంది. కానీ మొదటి రోజు జస్ట్ ఓకే అనిపించే ఓపెనింగ్స్ ను మాత్రమే రాబట్టింది. ఇక రెండో రోజు కూడా జస్ట్ ఓకె అనిపించింది. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 0.31 cr
సీడెడ్ 0.21 cr
ఆంధ్ర 0.42 cr
ఏపీ +తెలంగాణ 0.94 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.23 cr
వరల్డ్ వైడ్(టోటల్) 1.17 cr

‘ఊర్వశివో రాక్షశివో’ చిత్రానికి రూ.6.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.6.75 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.1.17 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా రూ.5.58 కోట్లు షేర్ ను రాబట్టాలి.

టార్గెట్ ఈజీ అయితే కాదు కానీ టాక్ పాజిటివ్ గా రావడంతో రెండో రోజు కొంత గ్రోత్ చూపించింది. కాబట్టి.. మూడో రోజు కూడా క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. అయితే కాంతార దూకుడు ఇంకా తగ్గకపోవడంతో ‘ఊర్వశివో రాక్షశివో’ టార్గెట్ టఫ్ గా మారింది అని చెప్పాలి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus