ఏపీలో ఎలక్షన్ వాతావరణం ఏర్పడింది. ఎన్నికల కోడ్ కూడా అమలులో ఉంది. ఇలాంటి టైంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రకటనలు వంటివి ఏమైనా విడుదల చేయాలనుకొంటే, ఎలక్షన్ కమీషన్ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – హరీష్ శంకర్(Harish Shankar)..ల ‘ఉస్తాద్ భగత్‌సింగ్’(Ustaad Bhagat Singh) నుండి చిన్న గ్లింప్స్ లాంటిది ఒకటి రిలీజ్ అయ్యింది. ఇందులో పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ గుర్తు అయిన గ్లాస్ గురించి డైలాగులు ఉన్నాయి.
‘గాజు పగిలేకొద్దీ పదునెక్కుద్ది’ ‘గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం’ అనే పవర్ ఫుల్ డైలాగులు కూడా ఉన్నాయి. ఈ ఎన్నికల టైంలో ఇవి జనసేన పార్టీకి మైలేజ్ చేకూర్చేవే అయినప్పటికీ.. ఇంకో రకంగా చూసుకుంటే ప్రత్యర్థి పార్టీలపై సెటైర్లు మాదిరి కూడా ఉన్నాయి చెప్పడంలో అతిశయోక్తి అనిపించుకోదు. ఇలా రాజకీయ ప్రచారం చేసుకునే ఉద్దేశ్యం ఉంటే గనుక.. టీజర్‌ని ఆపేయాల్సి ఉంటుంది.
సినిమా ప్రచారంలో భాగంగా మాత్రమే చేసింది కాబట్టి దీనిపై ఇంత డిస్కషన్ ఉండడు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ టీ గ్లాస్ తో పలు సినిమాల్లో ఫోజులు ఇచ్చాడు. అవి ఇప్పుడు టీవీల్లో టెలికాస్ట్ అవుతున్నాయి కదా అని ప్రచారం అనుకోకూడదు కదా..! కానీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఓ మీటింగ్లో ఈ గ్లింప్స్ గురించి.. గ్లాస్ డైలాగ్ గురించి ప్రస్తావించాడు.
‘దర్శకుడు హరీష్ శంకర్ బలవంతం మీదే ఆ డైలాగ్ చెప్పానని, అభిమానులు ఇలాంటి కౌంటర్లు తమకు కావాలని ఆశపడుతున్నట్లు’ హరీష్ చెప్పాడని పవన్ స్పీచ్ లో భాగంగా చెప్పాడు. అందుకే ఆ గ్లింప్స్ ను నిలిపివేయాలంటూ ప్రత్యర్థి పార్టీ నేతలు మండిపడుతున్నారు.
విజయ్ కారు ధ్వంసం.. కారణం?
‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండీ మరో గ్లింప్స్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?