Ustaad: ‘ఉస్తాద్’ టైటిల్ ను రిజిస్టర్ చేయించుకున్న స్టార్ డైరెక్టర్..!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ పేరుతో పవన్ కళ్యాణ్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు నిర్మాతలు. ‘తేరి’ రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. నిజానికి మొదట ఈ ప్రాజెక్టుకి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు అనౌన్స్ చేశారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నట్టు చెప్పుకొచ్చాడు హరీష్. కానీ ఇప్పుడు అది ‘తేరి’ రీమేక్ గా మారింది.

ఒరిజినల్ ను యాజ్ ఇట్ ఈజ్ గా దించకుండా తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగినట్టు చాలా మార్పులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా… ఇప్పుడు ‘ఉస్తాద్’ టైటిల్ తో మరో సినిమా రూపొందుతుంది. ఓ స్టార్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. రామ్ – పూరి కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. ఈ మూవీలో ‘ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్’ గా రామ్ ను ప్రెజెంట్ చేశాడు పూరి. తర్వాత ‘లైగర్’ అనే పెద్ద సినిమా చేశాడు.

ఇది ఘోరపరాజయం పాలైంది. కొద్ది నెలల నుండి చిరంజీవి, బాలయ్య ల వెంట తిరిగాడు. వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో మళ్ళీ రామ్ వద్దకు వచ్చాడు. ‘ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్’ టైటిల్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ను ప్లాన్ చేశాడు పూరి. ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన టైంలోనే టైటిల్ ను రిజిస్టర్ చేసి పెట్టించాడు.

రామ్ కూడా ఈ ప్రాజెక్టులో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు రామ్. అది కూడా పాన్ ఇండియా సినిమానే..! అది పూర్తయ్యాక పూరితో సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus