Uttej Wife Passed Away: నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం… ఆయన భార్య పద్మ ఇక లేరు..!

ప్రముఖ కమెడియన్, విలక్షణ నటుడు అయిన ఉత్తేజ్ అందరికీ సుపరిచితమే.ఈరోజు ఆయన ఇంట విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే… ఉత్తేజ్ భార్య పద్మ ఈరోజు ఉదయం బసవతారకం ఆసుపత్రిలో ఉదయం 8 గంటల ముప్పై నిముషాలకు కన్నుమూశారు.కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తోంది పద్మ. కొద్ది రోజుల ముందు వరకు ఆమె బాగానే ఉన్నారు.కానీ గత రెండు వారాల నుండీ ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అనుభవజ్ఞులైన డాక్టర్ లను బసవతారకం ఆసుపత్రి వాళ్ళు పిలిపించారు.

అయినప్పటికీ ఉపయోగం లేకపోయింది.ఇక పద్మ మరణ వార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్ ,జీవిత రాశేఖర్ వంటి పలువురు సినీ ప్రముఖులు బసవతారకం హాస్పిటల్ కి చేరుకొని ఉత్తేజ్ ని పరామర్శించారు.ఉత్తేజ్ కు ఓ యాక్టింగ్ స్కూల్ ఉన్న సంగతి తెలిసిందే.దాని పేరు మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్. ఇక్కడి వ్యవహారాలను ఉత్తేజ్ భార్య పద్మనే ఎక్కువగా చక్క పెడుతూ ఉండేవారు. ఉత్తేజ్ దంపతులకు ఇద్దరు పిల్లలు.

వాళ్ళ పేర్లు చేతన, పాట. చేతన బద్రి సినిమాలో నటించింది. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పార్క్ లో కూర్చొని మాట్లాడే పాప చేతనే. ఆమె హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చి ఓ సినిమా చేసింది.ఇదిలా ఉండగా.. పద్మ మరణంతో ఉత్తేజ్ మరియు ఆమె కుటుంబసభ్యులు కన్నీటి పర్యవంతమవుతున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Share.