తెలుగు సినిమా రేంజ్ పెరిగింది అని చాటి చెప్పిన క్రికెటర్ భార్య.. వీడియో వైరల్

తెలుగు సినిమా రేంజ్ పెరిగింది అని చాలా చాలా సినిమాలు చాటి చెప్పాయి. అయితే ‘పొరుగింటి పుల్లకూర రుచి’ అన్నట్టు మనవాళ్లకు మన సినిమాలు నచ్చవు, మన సినిమాల్లో పాటలైతే అసలే నచ్చవు. హైదరాబాద్ లో చూసుకుంటే చాలా చోట్ల హిందీ సినిమాల పాటలే వినిపిస్తాయి. అవి విన్నప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నామా.. ముంబైలో ఉన్నామా అనే డౌట్ కూడా వస్తుంది. అయితే గత 3 ఏళ్లలో.. ఆడియో పరంగా మన తెలుగు సినిమాలు క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీ ఇన్నీ కావు.

‘అల వైకుంఠపురములో’ సినిమాలోని పాటలు దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని పాటలు మనవాళ్ళకి పెద్దగా ఎక్కలేదు కానీ వార్నర్ లాంటి వాళ్లకు తెగ నచ్చేశాయి. దేశం మొత్తం మన తెలుగు సినిమా ఫ్లేవర్ ను కానీ, పాటల్ని కానీ బాగా ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలో … ” ప్రముఖ యూట్యూబర్, భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడు అయిన యజ్వేంద్ర చాహల్ భార్య అయిన ధనుశ్రీ వర్మ..

కొత్త కొత్త పాటలకు మాస్ స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది అన్న సంగతి తెలిసిందే. అభిమానులను అలరిస్తూ ఉంటుంది. చూడటానికి చాలా చక్కగా ఉంటుంది ఈమె.హుషారెత్తే స్టెప్పులతో మాస్ ఆడియన్స్ ను కూడా ఉర్రూతలూగించగలదు. నితిన్ హీరోగా నటిస్తున్న ”మాచర్ల నియోజకవర్గం” మూవీలో ”రారా రెడ్డి ఐయామ్ రెడీ” అనే పాటలో ‘జయం’ సినిమాలోని ‘రాను రాను అంటూనే చిన్నదో.. చిన్నదో ‘ అనే పాట బిట్ ను వాడిన సంగతి తెలిసిందే. ధనుశ్రీ ఈ పాటకు మాస్ స్టెప్పులు వేసి హాట్ టాపిక్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Share.