ఒకప్పటి నిర్మాత వడ్డే రమేష్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు వడ్డే నవీన్ (Vadde Naveen) . ‘కోరుకున్న ప్రియుడు’ చిత్రంతో హీరోగా పరిచయమైన నవీన్ ఆ సినిమాతో మంచి ఫలితాన్నే అందుకున్నాడు. ఆ సినిమా వల్ల ఇతనికి లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది. అటు తర్వాత ‘పెళ్లి’ ‘స్నేహితులు’ ‘మానసిచ్చి చూడు’ (Manasichi Choodu) ‘చాలా బాగుంది’ ‘మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది’ వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యాడు.
ఆ తర్వాత మాస్ ఇమేజ్ కోసం ‘ధనుష్’ ‘శత్రువు’ ‘గురి’ వంటి సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. తర్వాత కొత్త హీరోల ఎంట్రీతో కనుమరుగైపోయాడు.వడ్డే నవీన్ నటించిన చివరి సినిమా ‘ఎటాక్’ (Attack). వడ్డే నవీన్ మొదటి భార్య చాముండేశ్వరి సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) మనవరాలు, నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) కూతురు అనే సంగతి చాలా మందికి తెలిసుండదు. కొన్ని కారణాల వల్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోయారు.
ఇదిలా ఉండగా.. వడ్డే నవీన్ ఇటీవల ఓ పెళ్లి వేడుకలో సందడి చేశాడు.ఇటీవల పరుచూరి రామ కోటేశ్వర రావు, కొత్త పల్లి గీత దంపతుల కొడుకు అభినయ్ తేజ్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. దీనికి వడ్డే నవీన్ హాజరయ్యాడు. ఇతను ఇలా ఓ ఫంక్షన్లో కనిపించి చాలా కాలం అయ్యింది. దీంతో అతని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలు, వీడియోలు చూసిన వాళ్ళు అంతా షాకవుతున్నారు. ఎందుకంటే నవీన్ గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు. కొంచెం ఒళ్ళు చేశాడు. ఫేస్ లో కూడా మార్పులు వచ్చాయి.