మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ఉప్పెనతోనే బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే రెండో సినిమా కొండపొలం ఫలితం వైష్ణవ్ తేజ్ కు షాకిచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన కొండపొలం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలైంది. హీరోగా ఉప్పెన తొలి సినిమా అయినప్పటికీ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాతోనే వైష్ణవ్ తేజ్ బాలనటుడిగా పరిచయమై ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.
వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ హీరోహీరోయిన్లుగా నటించిన రంగరంగ వైభంగా సినిమా సెప్టెంబర్ నెల 2వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. బీ.వీ,ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. రంగరంగ వైభవంగా ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్ తేజ్, గిరీశయ్య అలీతో సరదాగా షోకు హాజరయ్యారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా షూటింగ్ సమయంలో ఒక సీన్ లో బాగా నవ్వేశానని అప్పుడు పెదమామయ్య చిరంజీవి సీరియస్ అయ్యారని వైష్ణవ్ తేజ్ చెప్పుకొచ్చారు.
ఉప్పెనలో ఒక సీన్ చేస్తున్న సమయంలో ఎమోషన్స్ ను పండించలేక 20 టేక్స్ తీసుకున్నానని ఆ సమయంలో బాధతో కన్నీళ్లు వచ్చాయని వైష్ణవ్ తేజ్ తెలిపారు. రంగరంగ వైభవంగా సినిమాలో కూడా రొమాంటిక్ సాంగ్ ఉంటుందని వైష్ణవ్ తేజ్ తెలిపారు. నాకెప్పుడూ సీనియర్స్ అంటేనే క్రష్ అని వైష్ణవ్ తేజ్ అన్నారు.
పవన్ మామయ్య సినిమాలైన తమ్ముడు సినిమాను 120సార్లు బద్రి సినిమాను 130సార్లు చూశానని వైష్ణవ్ తేజ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సినిమాలంటే వైష్ణవ్ తేజ్ కు ఇంత అభిమానమా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రంగరంగ వైభవంగా సినిమాతో వైష్ణవ్ తేజ్ ఖాతాలో మరో సక్సెస్ చేరాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?