Varalakshmi Sarathkumar: శంకర్ సినిమాలు రిజెక్ట్ చేయడం పై వరలక్ష్మీ స్పందన.!
- April 27, 2024 / 06:30 PM ISTByFilmy Focus
సీనియర్ నటుడు శరత్ కుమార్ (R. Sarathkumar) కుమార్తె వరలక్ష్మి (Varalaxmi Sarathkumar) తన విలక్షణ నటనతో బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. మొదట్లో ఆమె హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. కానీ అవి ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది లేదు. అందుకే ఆమె రూటు మార్చి నెగిటివ్ రోల్స్ చేయడం మొదలుపెట్టింది. తమిళంలో ఆ పాత్రలు ఆమెకు ప్లస్ అవ్వలేదు. కానీ తెలుగులో మాత్రం బాగా ప్లస్ అయ్యాయి అని చెప్పొచ్చు. ‘క్రాక్’ (Krack) ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ‘హనుమాన్’ (Hanu Man) వంటి సినిమాలతో వరలక్ష్మీ స్టార్ అయిపోయింది.
అయితే శంకర్ (Shankar) దర్శకత్వంలో ఈమె ‘బాయ్స్’ సినిమా చేయాల్సింది కానీ మిస్ చేసుకుంది. ఆ తర్వాత శంకర్ నిర్మాణంలోనే ‘ప్రేమిస్తే’ చేయాలి. అది కూడా వద్దనుకుంది. ఈ విషయంపై తాజాగా వరలక్ష్మీ స్పందించింది. వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ.. ” శంకర్ గారి ‘బాయ్స్’ అలాగే ‘ప్రేమిస్తే’ వంటి సినిమాల్లో హీరోయిన్ ఛాన్సులు వచ్చాయి. కానీ మిస్ చేసుకోవాల్సి వచ్చింది. అవి మిస్ అయ్యాయి కదా అని నాకు రిగ్రెట్ అంటూ ఏమీ లేదు.

ఒకవేళ నేను ఆ సినిమాల్లో హీరోయిన్ గా చేసుంటే.. ఆ సైకిల్ అలా తిరిగి తిరిగి ఆగిపోతుంది. హీరోయిన్ తర్వాత నేను ఏదైనా చేయడానికి చాలా ఇబ్బంది. పైగా నాతో పాటు హీరోయిన్లుగా చేసిన వాళ్ళ కెరీర్ చాలా వరకు ఎండ్ అయిపోయింది. కానీ నాకు ఆ ఇబ్బంది లేదు. నేను ఈ రోల్స్ చేస్తూనే హీరోయిన్ గా చేయవచ్చు, విలన్ గా చేయవచ్చు.. ఎలా అయినా చేయవచ్చు. లైఫ్ లాంగ్ నేను బిజీగా ఉంటాను. ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే నాకు ఎలాంటి బాధ లేదు” అంటూ చెప్పుకొచ్చింది.














