Varalaxmi: క్యాష్ షోలో కంటతడి పెట్టిన నటి వరలక్ష్మి!

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన క్యాష్ షోకు గత కొన్నేళ్లుగా సుమ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. నవంబర్ నెల 6వ తేదీన ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ కాగా ఆమని, యమున, దివ్యవాణి, వరలక్ష్మి ఈ షోలో పాల్గొన్నారు. తెలుగులో స్టార్ హీరోలకు చెల్లెలుగా నటించి ఆంధ్రా సిస్టర్ గా పేరు సంపాదించుకున్న వరలక్ష్మి ఈ షోలో కన్నీళ్లు పెట్టుకున్నారు. నా కుటుంబ సభ్యులలో ఐదుగురు మరణించారని ఆమె చెప్పుకొచ్చారు.

నా చిన్న సిస్టర్ సరస్వతి భర్త కరోనాతో చనిపోయారని సరస్వతి కూడా చనిపోతుందని అనుకున్నామని ఎంతో కష్టపడి ఆమెను బ్రతికించుకున్నామని వరలక్ష్మి వెల్లడించారు. ఆ సమయంలో తనను చూడటానికి కూడా పంపించలేదని వరలక్ష్మి పేర్కొన్నారు. నలుగురు సిస్టర్స్ ఉన్నారని ఎవరూ వెళ్లలేదని తను ఒక్కరే శవాన్ని తీసుకెళ్లారంటూ వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి 9.30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయమైన వరలక్ష్మి కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించారు.

ఎక్కువ సినిమాల్లో సిస్టర్ రోల్స్ లో నటించిన వరలక్ష్మి 200కు పైగా సినిమాలలో నటించగా 100కు పైగా సినిమాలలో చెల్లెలి రోల్స్ లో నటించడం గమనార్హం. వరలక్ష్మి కష్టాలను విని సుమ, యమున, దివ్యవాణి, ఆమని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు. ప్రోమోలో సుమ నటీమణులతో డ్యాన్సులు చేయించడంతో పాటు ఇతర ఆటలు కూడా ఆడించడం గమనార్హం. దీపావళి పండుగ సందర్భంగా నటీమణులు టపాసులు కాల్చారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus