టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవల ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఓ సినిమాను మొదలుపెట్టింది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాను హరి, హరీష్ అనే ఇద్దరు దర్శకులు రూపొందిస్తున్నారు. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఉంటాయని సమాచారం. అయితే ఈ సినిమాలో ఓ పాత్ర కోసం తమిళ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
సినిమాలో ఆమె పాత్ర ప్రత్యేకంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో వరలక్ష్మికి క్రేజ్ బాగా పెరిగింది. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘క్రాక్’ సినిమాలో ఆమె పాత్రకు భారీ అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు సమంతతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. ఈ సినిమాను తెలుగుతో పాటు.. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.
ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తరువాత సమంత మరో బైలింగ్యువల్ సినిమా చేయనుంది. అలానే ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ కూడా చేయబోతుంది.
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!