ప్రభాస్ హీరోగా శోభన్ డైరెక్షన్ లో తెరకెక్కిన వర్షం మూవీ 2004 సంవత్సరంలో విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఎం.ఎస్.రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ కెరీర్ మొదలు కాగా ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు కావడంతో ఈ సందర్భంగా ప్రభాస్ నటించిన వర్షం సినిమాను రీరిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.
సరైన ప్రమోషన్స్ లేకుండా ఈ సినిమా రిలీజ్ కావడంతో పాటు అదే సమయంలో ప్రభాస్ నటించిన కొన్ని సినిమాలు సెప్టెంబర్ నెలలో రీరిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తక్కువ సమయంలోనే ప్రభాస్ సినిమాలు రీరిలీజ్ కావడం వల్ల కూడా వర్షం సినిమా రీరిలీజ్ లో దారుణమైన ఫలితాన్ని అందుకుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షం షోలు క్యాన్సిల్ కావడం గమనార్హం. కొన్ని ప్రముఖ థియేటర్లలో మాత్రమే ఈ సినిమాకు హౌస్ ఫుల్స్ పడ్డాయి.
ఈ సినిమాకు టికెట్ రేట్లు మరీ ఎక్కువగా పెట్టడం కూడా ఒక విధంగా మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వర్షం మూవీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉండటం వల్ల ఈ సినిమాకు టికెట్ రేట్లు తగ్గించి ఉంటే ఈ సినిమాకు మెరుగైన రెస్పాన్స్ వచ్చి ఉండేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలను రీరిలీజ్ చేసే సమయంలో మేకర్స్ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ప్రభాస్ సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ప్రభాస్ సినిమాలకు రికార్డ్ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి.
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!