సినిమా ఆర్టిస్ట్ ల కంటే కూడా సీరియల్ ఆర్టిస్ట్ లు ఇంకా ఫేమస్ అనే చెప్పాలి. వాళ్ళు ప్రతీ శుక్రవారం కనిపిస్తారు.. వీళ్ళు ప్రతీరోజు కనిపిస్తారు.. అందులో కుటుంబ ప్రేక్షకుల గుర్తింపు ఎక్కువగా సీరియల్ ఆర్టిస్టులకే ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో తెలుసు సీరియల్స్ లో ఎక్కువగా కన్నడ, తమిళ ఆర్టిస్ట్ లు కనిపిస్తుండటం గమనార్హం. అయితే మన తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా అందరినీ ఆదరిస్తారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక ‘వరూధిని పరిణయం’ సీరియల్ గురించి ఎవరింట్లో అడిగినా చెబుతారు.చాలా మందికి ఈ సీరియల్ టైటిల్ చెప్పగానే మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ సినిమా గుర్తుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమాలో వచ్చే సీరియల్ ఎపిసోడ్ వద్ద మహేష్ బాబు ఈ టైటిల్ గురించి ప్రస్తావిస్తుంటాడు. ఈ సీరియల్ ద్వారా కన్నడ భామ చందన శెట్టి తెలుగు నాట బాగా పాపులర్ అయ్యింది. కన్నడ సినిమాలకు డబ్బింగ్ చెబుతూ, యాంకర్ గా కూడా రాణించిన ఈ బ్యూటీ..
తెలుగు సీరియల్స్ లో అవకాశాలు దక్కించుకుంది. వరూధిని పరిణయం లో వరూధినిగా నటించి క్రేజ్ సంపాదించుకున్న ఈ అమ్మడు, అటు తర్వాత దేవయాని, పవిత్ర బంధం, నీలాకుయిల్, జ్యోతి, స్వర్ణ ప్యాలెస్ వంటి సీరియల్స్ లో నటించింది. కొద్దిరోజుల క్రితం ఈమె పెళ్లి చేసుకుని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న చందన.. తన భర్త ఫోటోలు కూడా షేర్ చేసింది.ఆమె భర్త పేరు అనిల్. అతను తెలంగాణ కుర్రాడు అని ఈ బ్యూటీ తెలిపింది. పెళ్లయ్యాక నటనకు దూరంగా ఉన్న చందన ప్రస్తుతం యూ.ఎస్ లో ఉంటుంది. వీరి పెళ్లి ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి:
1
2
3
4
5
6
7
8
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!