Varun Sandesh: ఆ రూమర్లకు చెక్ పెట్టిన వరుణ్ సందేశ్!

తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చిన సినిమాలలో హ్యాపీడేస్ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. యువతను ఎంతగానో ఆకట్టుకున్న హ్యాపీడేస్ సినిమా ఇప్పటికీ టీవీలలో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటుండటం గమనార్హం. ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని ప్రేక్షకులలో చాలామంది భావిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో వరుణ్ సందేశ్ హ్యాపీడేస్ సీక్వెల్ గురించి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శేఖర్ కమ్ముల తనతో హ్యాపీడేస్ పార్ట్2 తెరకెక్కించాలని అనుకున్నారని

కానీ ఎందుకో ఆ సినిమా మెటీరియలైజ్ కాలేదని వరుణ్ తెలిపారు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల లీడర్ చేసుకున్నారని వరుణ్ తనపై వచ్చిన రూమర్లకు చెక్ పెట్టారు. శ్రద్ధాదాస్ కు తనకు సంబంధించి వచ్చిన వార్తల్లో నిజం లేదని వరుణ్ వెల్లడించారు. గతం గురించి తాను ఆలోచించనని భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తానని వరుణ్ సందేశ్ పేర్కొన్నారు. కథల విషయంలో జడ్జిమెంట్ నాదేనని నాన్న ఒపీనియన్ కూడా తీసుకుంటానని వరుణ్ అన్నారు.

యాక్టింగ్ కు సంబంధించి ఎలాంటి ట్రైనింగ్ తీసుకోలేదని అయితే వర్క్ షాప్స్ లో మాత్రం పాల్గొన్నానని వరుణ్ అన్నారు. కొత్త బంగారు లోకం సినిమాలో ఇచ్చిన ప్రతి ఎక్స్ ప్రెషన్ కు కారణం శ్రీకాంత్ అడ్డాల అని వరుణ్ చెప్పుకొచ్చారు. తనతో పని చేసిన ప్రతి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు కృతజ్ఞతలు చెబుతున్నానని వరుణ్ వెల్లడించారు. బాల్యంలో తాను కేర్ లెస్ గా, కోపంతో ఉండేవాడినని వరుణ్ పేర్కొన్నారు.

మోహన్ బాబుపై ఉండే రెస్పెక్ట్ వల్ల మామ మంచు అల్లుడు కంచు, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేశానని వరుణ్ వెల్లడించారు. మోహన్ బాబు తన మ్యారేజ్ కు రాలేకపోయినా తర్వాత రోజు ఇంటికి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారని వరుణ్ తెలిపారు. ఒక దశలో నేను చేసిన సినిమాలు ఫ్లాప్ కావడంతో బ్రేక్ తీసుకున్నానని వరుణ్ చెప్పుకొచ్చారు. తాజాగా వరుణ్ నటించి విడుదలైన ఇందువదన ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో వరుణ్ సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus