Varun Tej, Lavanya: వరుణ్ లావణ్య పెళ్లి దుస్తుల కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా?

మెగా హీరో వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి ఇటలీలో పెళ్లి బంధంతో ఒకటైన సంగతి మనకు తెలిసిందే. మిస్టర్ సినిమా సమయంలోనే ప్రేమలో పడినటువంటి వీరిద్దరూ రహస్యంగా ప్రేమ ప్రయాణం కొనసాగిస్తూ వీరి ప్రేమ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఇలా గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటయ్యారు. వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటలీలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

ఈ విధంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి కావడంతో ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పెళ్లి కోసం మెగా, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇటలీలోనే ఉన్న సంగతి మనకు తెలిసిందే. నిన్న సాయంత్రం వరుణ్ తేజ్ లావణ్య మెడలో మూడు ముళ్ళు వేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఈ పెళ్లి ఫోటోలలో భాగంగా వరుణ్ తేజ్ (Varun Tej) లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా సంప్రదాయ దుస్తులను ధరించిన సంగతి మనకు తెలిసిందే. వరుణ్ తేజ్ గోల్డ్ కలర్ శార్వాని పంచ కట్టుతో ఉండగా లావణ్య త్రిపాఠి మాత్రం ఎరుపు రంగు కంచి పట్టుచీరను ధరించి ఎంతో అందంగా కనిపించారు ఇలా వీరిద్దరూ కూడా పెళ్లి కోసం తమ దుస్తులను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల పెళ్లి కోసం ప్రముఖ వెడ్డింగ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ దుస్తులను డిజైన్ చేశారు.

మనీష్ మల్హోత్రా ఇప్పటికే ఎంతోమంది సెలబ్రెటీ కపుల్ కి వెడ్డింగ్ డిజైనర్ గా పనిచేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లికి కూడా ఈయన ప్రత్యేకంగా ఈ కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. మరి ఈ పెళ్లిలో వీరు ధరించినటువంటి ఈ కాస్ట్యూమ్స్ ఖరీదు గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లిలో వేసుకున్నటువంటి ఈ కాస్ట్యూమ్స్ విలువ సుమారు 50 లక్షల పైగా ఉంటుందని సమాచారం.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus