Varun Tej, Pawan Kalyan: పవన్ గిఫ్ట్ విషయంలో వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆరేళ్ల పాటు ప్రేమించుకున్న వరుణ్ లావణ్య పెళ్లి బంధంతో ఒకటి కావడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. పెళ్లి ఫోటోలలో పవన్ కనిపించలేదని కొంతమంది ఫ్యాన్స్ ఫీలవ్వగా పవన్ హాజరైన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం వరుణ్ తేజ్ లావణ్య కోసం పవన్ కళ్యాణ్ దంపతులు భారీ గిఫ్ట్ ను ప్లాన్ చేశారట.

ఈ విషయం తెలిసిన వరుణ్ తేజ్ బాబాయ్ మీరు పెళ్లికి హాజరైతే అదే పెద్ద గిఫ్ట్ అని చెప్పారట. పవన్ మాత్రం పెళ్లికి హాజరు కావడంతో పాటు అమూల్యమైన గిఫ్ట్ ను వరుణ్ తేజ్ దంపతులకు ఇచ్చారని సమాచారం అందుతోంది. ఆ గిఫ్ట్ కు సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. వరుణ్ తేజ్ లావణ్య జోడీ బాగుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మెగా హీరోలందరూ షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి ఈ పెళ్లి వేడుకలో పాల్గొనడం గమనార్హం. ఇద్దరి అభిరుచులు కలవడం వల్ల మా ఇద్దరి మధ్య స్నేహం మొదలై ప్రేమగా మారిందని వరుణ్ తేజ్ ఒక సందర్భంలో తెలిపారు. నా ఇష్టాలు లావణ్య త్రిపాఠికి బాగా తెలుసని వరుణ్ తేజ్ కామెంట్లు చేశారు.

వరుణ్ తేజ్ (Varun Tej) లావణ్య త్రిపాఠి పెళ్లికి హాజరు కాని సినీ సెలబ్రిటీలు ఈ నెల 5వ తేదీన జరగనున్న రిసెప్షన్ కు హాజరు కానున్నారు. వరుణ్ లావణ్యల పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. . వరుణ్, లావణ్యలను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మెగా హీరోలందరూ ఒకే దగ్గర ఉన్న ఫోటోలు సైతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus