టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తుండటం గమనార్హం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ తన పారితోషికం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అంతరిక్షం సినిమాకు తాను సగం పారితోషికమే తీసుకున్నానని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. తన పారితోషికంలో మిగతా మొత్తాన్ని కూడా సినిమా కొరకు ఖర్చు చేయాలని సూచించానని ఆయన అన్నారు.
డైరెక్టర్, ప్రొడ్యూసర్ అడగకపోయినా సొంతంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని వరుణ్ తేజ్ వెల్లడించారు. సినిమాకు నష్టం వస్తే రెమ్యునరేషన్ తీసుకోకుండా కూడా పని చేయడానికి సిద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి రోజులు రాకూడదని కోరుకుంటున్నానని వరుణ్ తేజ్ వెల్లడించారు. అలాంటి రోజులు వచ్చినా తట్టుకునే శక్తి అయితే నాకు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. వరుణ్ తేజ్ (Varun Tej) ఆపరేషన్ వాలంటైన్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఎన్నో ప్రత్యేకతలతో ఆపరేషన్ వాలంటైన్ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ ఈ ప్రమోషన్స్ కోసం ఎంతో కష్టపడ్డారు. రిజల్ట్ రూపంలో ఆ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందేమో చూడాలి. ఈ ఏడాది ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో మెగా హీరోల బాక్సాఫీస్ ప్రభంజనం మొదలు కావాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ వాలంటైన్ తెలుగుతో పాటు హిందీలో రిలీజ్ కానుంది.
మెగా హీరోలు బాక్సాఫీస్ ను షేక్ చేసే ప్రాజెక్ట్ లలో నటించి మరిన్ని విజయాలను సొంతం చేసుకున్టారేమో చూడాల్సి ఉంది. వరుణ్ కెరీర్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వరుణ్ తేజ్ హిందీలో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ ప్లాన్స్ కూడా భారీ స్థాయిలో ఉన్నాయని సమాచారం అందుతోంది. వరుణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.