నో కాంప్రమైజ్ అంటోన్న వరుణ్ తేజ్!

మెగాహీరో వరుణ్ తేజ్ రెగ్యులర్ కమర్షియల్ హీరోల కాకుండా సరికొత్త కథలను ఎన్నుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అతడి సక్సెస్ రేట్ కూడా బాగానే ఉంది. ‘ఎఫ్ 2’ సినిమా సైన్ చేసిన సమయంలో వరుణ్ తేజ్ కి మంచి హిట్లున్నాయి. అయినప్పటికీ వెంకటేష్ లాంటి హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేయకుండా దిల్ రాజు ఇస్తానని చెప్పిన మొత్తాన్నే తీసుకున్నాడు. పాత్ర పరంగా కూడా ఎలాంటి డిమాండ్లు చేయలేదు.

కానీ ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తోన్న సినిమా విషయంలో మాత్రం వరుణ్ కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్నాడట. తన రెమ్యునరేషన్ పెంచి అడుగుతున్నాడట. అలానే పాత్ర పరంగా కూడా తనకు సమాన ప్రాధాన్యం ఉండాలని చెప్పాడట. వరుణ్ తేజ్ ఇప్పుడిలా పట్టుబట్టడం వలన దిల్ రాజు దీనిని ఎలాగోలా తెగ్గొట్టాలని చూస్తున్నాడట. ‘ఎఫ్2’ సినిమాకి దిల్ రాజు రూ.30 కోట్లకు పైగా లాభాలు పొందాడు. సీక్వెల్ అంటే ఖచ్చితంగా క్రేజ్ భారీ స్థాయిలో ఉంటుంది కనుక ఈసారి వరుణ్ అయినా.. వెంకటేష్ అయినా తక్కువకు సర్దుకుపోయే ఛాన్స్ లేదు.

అలానే దర్శకుడు అనిల్ రావిపూడికి కూడా మునుపటి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వక తప్పదు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో అనిల్ స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు కాబట్టి అతడు కూడా పారితోషికం విషయంలో రాజీ పడడు. ‘ఎఫ్2’ సినిమాను దిల్ రాజు ముప్పై కోట్ల లోపే పూర్తి చేశాడు. కానీ సీక్వెల్ కి మాత్రం కనీసం యాభై కోట్లకు మించి ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. కరోనాని కారణంగా చూపించి బడ్జెట్ పరంగా కోతలు విధించాలని చూస్తోన్న దిల్ రాజుకి ఈ సినిమా విషయంలో రాయితీలు వచ్చేలా లేవు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus