Varun Tej: ఫైనల్ గా వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చేశాడు.. నెక్స్ట్ సినిమా అతనితోనే..!
- November 10, 2024 / 09:00 AM ISTByFilmy Focus
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన ‘మట్కా’ (Matka) నవంబర్ 14న విడుదల కాబోతోంది. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ (Karuna Kumar) డైరెక్ట్ చేసిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చాలా కాలం తర్వాత కొంచెం మాస్ టచ్ ఉన్న క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నాడు వరుణ్ తేజ్. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అనే నమ్మకంతో ఉన్నాడు. అయితే కరుణ కుమార్ కి పెద్ద హిట్ ఏమీ లేదు. ‘పలాస’ కి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
Varun Tej

‘శ్రీదేవి సోడా సెంటర్’ (Sridevi Soda Center) ప్లాప్ గా మిగిలింది. ‘కళాపురం’ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. దాని ఫలితాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ‘మట్కా’ ట్రైలర్లోని డైలాగులు అతని స్టైల్లో ఉన్నాయి. ఇదిలా ఉండగా..ఈ మధ్య వరుణ్ తేజ్, ఇలా అంచనాలు లేని దర్శకులతోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. త్వరలో అతను విక్రమ్ సిరికొండ (Vikram Sirikonda) అనే దర్శకుడితో కూడా సినిమా చేయడానికి అంగీకరించాడు. గతంలో ఇతను రవితేజతో (Ravi Teja) ‘టచ్ చేసి చూడు’ (Touch Chesi Chudu) అనే సినిమా చేశాడు.

తాజాగా ఏర్పాటు చేసిన.. మీడియా సమావేశంలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు వరుణ్ తేజ్. ‘విక్రమ్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. మంచి కసితో ఆ కథ రాసుకున్నాడు.త్వరలోనే ఆ ప్రాజెక్టు గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తాం’ అంటూ చెప్పుకొచ్చాడు వరుణ్. ఇక ‘డైరెక్టర్ల ముందు సినిమాల ఫలితాలను నేను ఎప్పుడూ పట్టించుకోను. ఎక్కడో చిన్న పొరపాటు జరిగి ఉంటుందేమో అని అనుకుంటాను. వాళ్లలో ఎంత కసి ఉంది అనేది గమనించే నేను సినిమాలు ఓకే చేస్తాను’ అని కూడా వరుణ్ తేజ్ తెలిపాడు.












