Varun, Lavanya: వరుణ్‌లావ్‌… సోషల్‌ మీడియాలో ఈ కామన్‌ విషయం చూశారా?

మెగా హీరో వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠి ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి అభిమానులు, సెలబ్రిటీలు, సన్నిహితులు విషెష్‌ చెబుతున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వరుణ్‌లావ్‌ కలసి ఓ పోస్ట్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇద్దరూ కలసి విదేశాల్లో కలసి తిరుగుతున్న ఫొటో ఇది. ఆ ఫొటో ఎప్పుడు తీశారు, ఎక్కడ తీశారు అనే విషయం చెప్పలేదు కానీ.. పోజు అయితే భలేగా ఉంది.

దీంతో అభిమానులు ఆ పోస్ట్‌ కింద కామెంట్ల వర్షం, పోస్ట్‌కి లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికరమైన విషయాన్ని కొంతమంది నెటిజన్లు ప్రస్తావించారు. అదే ఇన్‌స్టాగ్రామ్‌లో వారి ఫాలోవర్ల సంఖ్య. అవును.. ఇద్దరికీ ఇన్‌స్టాగ్రామ్‌లో సమానమైన ఫాలోవర్లు ఉన్నారు. ఇద్దరికీ 3.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఇన్‌స్టాలో కూడా వీరిద్దరికీ భలే సింక్‌ కుదిరిందీ అంటూ పోస్ట్‌ కింద కామెంట్లు పెడుతున్నారు. అయితే వరుణ్‌తేజ్‌ రీసెంట్‌గా 3.2 మిలియన్‌కి రాగా, లావణ్య 3.3 మిలియన్‌కి దగ్గరలో ఉంది.

వరుణ్ తేజ్‌ (Varun) , లావణ్య త్రిపాఠిల ప్రేమకథ విషయానికొస్తే… ‘మిస్టర్’ సినిమా టైమ్‌లో ఇద్దరికీ పరిచయం అయ్యింది. ఆ సినిమా షూట్‌లోనే ఆ పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది అంటున్నారు. 2017లో మొదలైన ఈ ప్రేమ 2023లో ఎంగేజ్‌మెంట్‌తో పెళ్లి బంధానికి దగ్గరైంది. నిహారిక పెళ్లి వేడుకల్లో లావణ్య త్రిపాఠి కనిపించినప్పుడు వరుణ్‌లావ్‌ ప్రేమ గురించి పుకార్లు మొదలయ్యాయి. అయితే లేదు లేదు అంటూ ఇన్నాళ్లూ ఖండించిన రెండు వర్గాలు ఇప్పుడు అవును అనేశాయి.

ఇక వీరి పెళ్లి గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏమీ లేదు. అయితే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లో ఇద్దరూ మొగ్గుచూపుతున్నారని సమాచారం. ఈ మేరకు ఏర్పాట్ల కోసం ప్రయత్నాలు సాగుతున్నాయట. త్వరలోనే ఈ విషయం లీకుల రూపంలో బయటకు రావొచ్చు. ఆ తర్వాత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus