రెండు వరుస సినిమాలకు ఒకే లుక్, ఒకే తరహా కథ లేకుండా చూసుకోవడం అంటే సామాన్యమైన విషయమా? కాదంటే కాదు అని చెప్పాలి. ఇలా ప్రస్తుతం కెరీర్‌ను కొనసాగిస్తున్న కథానాయకుడు వరుణ్ తేజ్. ‘గని’ సినిమాతో ఇటీవల వచ్చి సరైన విజయం అందుకోలేకపోయిన వరుణ్.. ఇప్పుడు ‘గాండీవధారి అర్జున’ అంటూ ఓ ప్రయోగాత్మక చిత్రంతో రావడానికి సిద్ధమయ్యాడు. శుక్రవారం సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో వరుణ్ అన్నట్లు పెళ్లి గురించి కాకుండా కేవలం సినిమా గురించే అడిగే ప్రయత్నం చేశాం. దానికి ఆయన సమాధానలు ఇవీ…
సినిమా నేపథ్యం గురించి వస్తున్న పుకార్లు, ట్రైలర్ బట్టి చూస్తే ఇదేదో సందేశాత్మక చిత్రంలా ఉందే అని కొందరు అంటున్నారు… అనుకున్నట్లుగా సందేశం అయితే ఇస్తున్నారట. కానీ మీరు మారండని చెప్పడం లేదట. సమస్యని ఆలోచన రేకెత్తించేలా చూపించారట. సినిమా చూశాక ప్రజల్లో ఎలాంటి మార్పు అవసరం అనేది ఎవరికివాళ్లే నిర్ణయించుకుంటారు అంటున్నాడు వరుణ్ తేజ్. అలా అని కొందరు అనుకుంటున్నట్లు ఈ సినిమా స్పై సినిమా కాదని, ఇందులో తానొక బాడీగార్డ్‌గా నటించానని తెలిపాడు.
ఓ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన బాడీగార్డ్‌గా తాను (Varun Tej) కనిపిస్తానని, సినిమాలో యాక్షన్ హై స్పీడ్‌లోనో లేక స్లో మోషన్‌లోనో కాకుండా నేచురల్‌గా ఉంటుందని చెప్పారు అందుకే ఆ సీన్స్ కోసం రోప్స్ లాంటివి ఎక్కువగా వాడలేదని తెలిపాడు. అలాగే గ్రాఫిక్స్ లొకేషన్ల కోసం తప్ప.. పాత్రల కోసం వాడలేదు అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో ఈ క్రమంలో కొన్ని దెబ్బలు కూడా తగిలాయని చెప్పాడు వరుణ్‌తేజ్. అలాగే కథకి తగ్గట్టుగా ఈ సినిమాకి కుదిరిందని, అర్జునుడు అంటే రక్షకుడే అనే ఆలోచన ఈ పేరు పెట్టామని తెలిపారు.
సినిమాలో నాజర్ పాత్ర శ్రీకృష్ణుడిని తలపిస్తే, తన పాత్ర అర్జునుడిలా ఉంటుందని చెప్పారు. దీంతోపాటు ఈ సినిమా కథ అంతా వారం రోజుల్లో తేలిపోతుందని చెప్పారు. తర్వతి సినిమాల గురించి చెబుతూ… ‘ఆపరేషన్ వాలెంటైన్’ వాయుసేన నేపథ్యంలో సాగే దేశభక్తి చిత్రమని తెలిపారు. ఆ తర్వాత ‘మట్కా’ అనే ఓ పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నానని, జూదం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలిపారు.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్