పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో ‘ది రాజాసాబ్’ (The Rajasaab) అనే సినిమా చేస్తున్నాడు. అది దాదాపు పూర్తి కావచ్చింది. మరోపక్క ‘ఫౌజీ’ చిత్రాన్ని కూడా ప్రారంభించాడు. హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ చిత్రానికి దర్శకుడు. దీంతో పాటు జూన్ నుండి ‘కల్కి 2’ షూటింగ్లో జాయిన్ అవుతాడట. అలాగే ‘సలార్ 2’ కూడా ఫినిష్ చేయాల్సి ఉంది. మరోపక్క సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ‘స్పిరిట్’ (Spirit) సినిమా కూడా చేయాలి.
ఈ ప్రాజెక్టుల్లో ప్రభాస్ అభిమానులు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటుంది ‘స్పిరిట్’ సినిమాపైనే అని చెప్పాలి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) కూడా నటిస్తున్నట్టు రెండు రోజుల నుండి గాసిప్స్ వినిపిస్తున్నాయి. అది కూడా ప్రభాస్ కి విలన్ గా వరుణ్ కనిపించబోతున్నాడనేది ఆ వార్త సారాంశం. వరుణ్ కొన్నాళ్లుగా వరుస ప్లాపులు ఎదుర్కొంటున్నాడు.
మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో ‘కొరియన్ కనకరాజు’ అనే సినిమా చేయబోతున్నాడు వరుణ్. కచ్చితంగా ఈసారి హిట్టు కొట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి టైంలో విలన్ గా ఈ మెగా హీరో టర్న్ తీసుకుంటున్నాడు అంటే అది అందరికీ షాకిచ్చే అంశమే. దీనిపై వరుణ్ టీంని ఆరాతీయగా అందులో నిజం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం హీరోగా అతను మరో రెండు ప్రాజెక్టులు సైన్ చేసే పనిలో ఉన్నాడట. సో ‘స్పిరిట్’ లో ప్రభాస్ కి విలన్ గా నటిస్తున్నాడు అనేది ఫేక్ న్యూస్ అనే చెప్పాలి.