సినిమా గురించి ప్రజల్లోకి వెళ్లడానికి చిత్ర బృందం అనేక కార్యక్రమాలు చేపడుతుంటుంది. అందులో భాగమే ప్రీమియర్ షోలు. రిలీజ్ కి ఒక రోజు ముందుగా చిత్రాన్ని ప్రదర్శిస్తుంటారు. అప్పుడు వచ్చే టాక్ వల్ల ఓపెనింగ్స్ పెరిగే అవకాశం ఉంది. అయితే ఇంద్రసేన దర్శకత్వం వహించిన “వీర భోగ వసంత రాయలు” సినిమాని మూడు రోజుల ముందుగా అమెరికాలో షోలు వేశారు. ఇది చిత్ర విజయానికి తోడ్పడుతుందని అనుకున్నారు. కానీ అడ్డం తిరిగింది. యువ హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు కలిసి నటించిన ఈ సినిమాలో శ్రియ కీలకరోల్ పోషించింది. ఈ మల్టీస్టారర్ మూవీకి అభినందనలు వస్తుందనుకుంటే విమర్శలు వస్తున్నాయి.
సినిమా క్రైమ్ థ్రిల్లర్.. .క్రైమ్ డ్రామానా అని జోనర్ ని కూడా చెప్పలేకపోతున్నారు. కథ బాగాలేదు.. నాణ్యత బాగాలేదని.. షార్ట్ ఫిలిం కి ఎక్కువ.. సినిమాకి తక్కువ నే రీతిలో ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నెగటివ్ రిపోర్ట్స్ ట్రోల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ వీర విహారం చేస్తున్నాయి. అసలే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఏమంత బజ్ లేదు. మల్టీ స్టారర్ అని చెప్పుకున్నప్పటికి మార్కెట్ పరంగా ఎవరూ కనీస స్థాయిలో ఓపెనింగ్స్ తెచ్చే వారు కాకపోవడంతో జనానికి పెద్దగా ఆసక్తి లేదు. పైగా ప్రస్తుత నెగటివ్ టాక్ శాపంలా మారింది. ఈ టాక్ ఎంతమేర నష్టాన్ని మిగిలిస్తుందో రేపటికి స్పష్టం కానుంది.