‘తంగలాన్’ తర్వాత విక్రమ్ (Vikram) నుండి ‘వీర ధీర శూర'(Veera Dheera Soora) అనే వచ్చిన సంగతి తెలిసిందే. ‘సేతుపతి’ (Vijay Sethupathi) ‘చిన్నా’ వంటి సినిమాలు తీసిన ఎస్.యు.అరుణ్ కుమార్ (S. U. Arun Kumar) దర్శకుడు. మార్చి 27న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ఆర్థిక లావాదేవీల కారణంగా ‘వీర ధీర శూర’ మార్నింగ్ షోలు, మ్యాట్నీలు క్యాన్సిల్ అయ్యాయి. ఫైనల్ గా అన్ని అడ్డంకులు తొలగించుకుని ఈవెనింగ్ షోలు పడ్డాయి. ఎస్.జె.సూర్య (S. J. Suryah) ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే 30 ఇయర్స్ పృథ్వీ (Prudhvi Raj) కూడా విలన్ రోల్ చేస్తుండటం మరో ఆసక్తికర విషయం.
తెలుగులో ఈ సినిమాని ఎన్.వి.ఆర్ సినిమాస్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేశారు. మొదటి రోజు ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు ఎస్.యు.అరుణ్ కుమార్ డైరెక్షన్ మాస్ ఆడియన్స్ కి నచ్చింది. అయితే నిన్న రిలీజ్ ఉందో లేదో చాలా మందికి తెలీకపోవడం వల్ల ఈ సినిమాకి ఓ మోస్తరు ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.06 కోట్లు |
సీడెడ్ | 0.02 కోట్లు |
ఆంధ్ర(టోటల్) | 0.04 కోట్లు |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 0.12 కోట్లు |
‘వీర ధీర శూర’ చిత్రానికి రూ.3.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.6 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ సినిమా షోలు చాలా వరకు క్యాన్సిల్ అయ్యాయి. 2 షోలు మాత్రమే పడ్డాయి చాలా చోట్ల. అలా చూసుకుంటే మొదటి రోజు రూ.0.12 కోట్లు షేర్ వచ్చింది. గ్రాస్ రూ.0.21 కోట్లు వచ్చినట్టు తెలుస్తుంది. 2వ రోజు నుండి పోటీగా ‘ఎల్ 2 : ఎంపురాన్'(L2: Empuraan) ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square)’రాబిన్ హుడ్’ ’ (Robinhood)లు ఉన్నాయి. మరి ఎలా కలెక్ట్ చేస్తుందో చూడాలి.