50 రోజులు, 100 రోజులు అనే మాటలు సినీ ప్రేక్షకులు విని చాలా రోజులు అయిపోయింది. ఈరోజుల్లో 50 రోజులు, 100 రోజులు అని చెప్పుకునే సినిమాలు లేవు.. రూ.50 కోట్లు, రూ.100 కోట్లు అని చెప్పుకోవడం తప్ప. ఇప్పుడు ఆ లెక్క కూడా పెరిగిపోయి రూ.150 కోట్లు, రూ.200 కోట్లు అంటూ చెప్పుకోవాల్సి వస్తోంది. అయితే అడపా.. దడపా స్టార్ హీరోల సినిమాలు 50 రోజులు, 100 రోజులు ఆడుతున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. ఈ లిస్ట్ లో సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ రికార్డు సృష్టించాడు అనే చెప్పాలి.
ఈ రోజుల్లో కూడా బాలయ్య ఖాతాలో బ్యాక్ టు బ్యాక్ 50 రోజులు ఆడిన సినిమాలు పడ్డాయి. బాలయ్య గత చిత్రం ‘అఖండ’ 50 రోజులు దిగ్విజయంగా ప్రదర్శింపబడింది ఆ సినిమా 103 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. అలాగే బాలయ్య లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ కూడా సక్సెస్ ఫుల్ గా 50 రోజులు ఆడి రికార్డు కొట్టింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి సక్సెస్ ఫుల్ గా 54 కేంద్రాల్లో అర్థ శతదినోత్సవం జరుపుకొంటోంది.
ఇందులో 23 కేంద్రాలు డైరెక్ట్‌గా ఆడినవి కాగా… మిగిలినవి షిఫ్టింగ్ లు ఉన్నాయి. జనవరి 12న ఈ చిత్రం విడుదలైంది. బాలయ్య కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా ‘వీరసింహారెడ్డి’ నిలిచింది. చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా పోటీగా ఉన్నప్పటికీ ‘వీరసింహారెడ్డి’ చిత్రం ఈ ఫీట్ ను సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ మధ్యనే ఓటీటీలో రిలీజ్ అయిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం అక్కడ కూడా రికార్డు వ్యూయర్ షిప్ ను నమోదు చేస్తూ దూసుకుపోతుంది.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!