సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి మూవీ సెకండాఫ్ విషయంలో కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. సెకండాఫ్ నిడివి ఎక్కువ కావడంతో కొంతమంది ప్రేక్షకులు బోరింగ్ గా ఫీలవుతున్నారు. అయితే బాలయ్య అభిమానులకు మాత్రం ఈ సినిమా ఎంతగానో నచ్చేసింది. అయితే ఈ సినిమా తుది ఫలితం ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. వాల్తేరు వీరయ్య, వారసుడు సినిమాల ఫలితాలు వీరసింహారెడ్డి ఫైనల్ రిజల్ట్ ను డిసైడ్ చేయనున్నాయి. బాలయ్య మాత్రం ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు తన నటనతో పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారనే చెప్పాలి.
వీరసింహారెడ్డి పాత్రలో బాలయ్య యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని ఆ పాత్రను చంపకుండా ఉండి ఉంటే బాగుండేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. వరలక్ష్మి బాలయ్య కాంబో సీన్లను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించడంలో గోపీచంద్ మలినేని తడబడ్డారని కొంతమంది చెబుతున్నారు. మరోవైపు బాలకృష్ణ డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ ను నమ్మి ఛాన్స్ ఇవ్వకుండా కథ, కథనంపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది.
కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో బాలయ్య ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. స్క్రీన్ ప్లే, నిడివి విషయంలో గోపీచంద్ మలినేని కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సెకండాఫ్ లో సాంగ్స్ ప్లేస్ మెంట్ కూడా బాలేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరసింహారెడ్డి మిక్స్డ్ టాక్ విషయంలో గోపీచంద్ మలినేని ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
బాలయ్య నటించిన పలు సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా రికార్డులు క్రియేట్ చేయగా ఈ సినిమా కూడా ఆ జాబితాలో చేరుతుందేమో చూడాలి. స్టూడెంట్స్ కు సంక్రాంతి సెలవులు మొదలుకావడంతో ఆదివారం వరకు వీరసింహారెడ్డి కలెక్షన్ల విషయంలో ఢోకా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!