F3 బడ్జెట్ పారితోషికాలే ఎక్కువ!

F 2 సినిమా కు ఫ్రాంచైజ్ గా వస్తున్న F3 సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంతో ఉంది. అనిల్ రావిపూడి రైటింగ్ మేకింగ్ స్కిల్స్ తో బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలను అందిస్తూ ఉంటాడు. F3 సినిమాకు ఏ స్థాయిలో లాభాలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక ఇప్పుడు మరోసారి అదే మ్యాజిక్ క్రియేట్ చేస్తాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు వచ్చిన F2 సినిమా సక్సెస్ కావడంతో ఈ సినిమాకు అంతకుమించి అనేలా వారి పారితోషికాలు కూడా ఇచ్చినట్లు సమాచారం. ఎఫ్ 2 సినిమా కు వెంకటేష్ కేవలం ఐదు కోట్ల వరకు మాత్రమే అందుకోగా ఇప్పుడు మాత్రం ఆయన పది కోట్లకు పైగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా వరుణ్ తేజ్ కూడా ఆ హిట్ ప్రభావంతోనే మునుపటి ఎక్కువగా 10కోట్ల పారితోషికం తీసుకున్నాడట. వీరిద్దరి పారితోషికం కూడా గతంలో కంటే చాలా ఎక్కువ అని తెలుస్తోంది. ఇక మొత్తంగా దిల్ రాజు ఈ సినిమా కోసం 45 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు సమాచారం. తమన్నా, మెహ్రీన్ అయితే వారి రేంజ్ కు తగ్గట్టుగా తీసుకున్నారు. ఇక ఈసారి సోనాల్ చేరింది. ఇక పూజా హెగ్డే ఐటెమ్ సాంగ్ కోసం కూడా గట్టిగానే ఖర్చు చేసినట్లు టాక్.

అయితే సినిమా టికెట్ల రేట్లు విషయంలో కూడా పెద్దగా రిస్కు చేయడం లేదు. టికెట్ల రేట్లను పెంచడం లేదని ఇటీవల చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు అనుకున్నంత స్థాయిలో అయితే బజ్ లేదు. కానీ ప్రమోషన్ విషయంలో మాత్రం తగ్గడం లేదు. మరి భారీ స్థాయిలో ఖర్చు పెట్టిన దిల్ రాజుకు ఈ సినిమా ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus