Aashritha Daggubati: ఫుడ్ వ్లాగ్స్ తో కోట్లు సంపాదిస్తున్న ఆశ్రిత?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కుటుంబంలో దగ్గుబాటి కుటుంబం ఒకటి. ఈ కుటుంబం నుంచి వెంకటేష్ హీరోగా ఇండస్ట్రీలోకి రాగా అనంతరం సురేష్ బాబు వారసులుగా రానా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇకపోతే వెంకటేశ్ సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఆయన కేవలం సినిమాలకు సంబంధించిన విషయాలను మాత్రమే అభిమానులతో పంచుకుంటారు. తన కుటుంబ విషయాలను బయట ప్రస్తావించడానికి వెంకటేష్ ఇష్టపడరు. ఇక వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత పెళ్లయిన తర్వాత సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉండి నిత్యం ఫుడ్ కు సంబంధించిన వీడియోలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

చిన్నప్పటినుంచి ఫుడ్ అంటే ఎంతో ఇష్టం ఉన్న ఆశ్రిత ప్రస్తుతం ఫుడ్ వ్లాగర్ గా ప్రపంచంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈమె ఎన్నో రకాల ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే ఆశ్రిత సమంత నాగచైతన్య రానా వంటివారు సోషల్ మీడియా వేదికగా ఏవైనా పోస్టులు పెడితే వాటికి స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం చెబుతుంటారు.

ఇకపోతే సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్న వారి జాబితాను హోపర్ డాట్ కామ్ విడుదల చేసింది. ఇందులో ఆశ్రిత చోటు సంపాదించుకోవడం విశేషం. ఈమె ఈ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 377 వ ర్యాంకులో ఉండగా ఆసియాలో 27వ ర్యాంకుతో కొనసాగుతోంది. ఇక బ్రాండ్ కొలాబరేషన్స్ తో కోట్లలో డబ్బును సంపాదిస్తూ తన తండ్రికి తగ్గ కూతురిగా పేరు సంపాదించుకుంది.

ఇక కేవలం ఇంస్టాగ్రామ్ ద్వారా మాత్రమే కాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా సోషల్ మీడియా వేదికగా భారీగా సంపాదిస్తున్న వారిలో ఆశ్రిత చోటు దక్కించుకోవడం విశేషం.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus