క్లూ… నేపాలీ కిలీకిలీ మనీషా గుర్తుందా?

‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమా గుర్తుందా? వెంకటేశ్‌ – ఈవీవీ సత్యనారాయణ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే జనాలు అతుక్కుపోతారు. కథ, కథనం, వినోదం, ట్విస్ట్‌లు… ఇలా అన్నీ కలగిలిపి విందు భోజనంలా అందించారు ఈవీవీ. అందులో సౌందర్య పాత్ర ఎంత గొప్పగా ఉంటుందో, నేపాలీ అమ్మాయి మనీషా పాత్రలో వినీత అనే కొత్త అమ్మాయి నటించింది? పైన ఫొటోలో చూస్తున్నది ఆమెనే. అవును ఆ సినిమాలో కిలీకిలీ అంటూ మేకపిల్లతో ఆడుకున్న సన్నజాజి ఈమెనే.

సినిమాల్లో అవకాశాలు తగ్గాక హీరోయిన్లు లావెక్కడం కొత్త విషయమేమీ కాదు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు అలా అయ్యారు. వినీత కూడా అంతే. అయితే పైన ఫొటో కొత్తదేం కాదు. ఓ నాలుగేళ్ల క్రితం ఓ కార్యక్రమంలో క్లిక్‌ చేసిన ఫొటో. అయితే ఇప్పుడు మరోసారి వైరల్‌ అవుతోంది. వినీత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా ‘ఇంట్లో ఇల్లాలు.. వంటింట్లో ప్రియురాలు’తో వచ్చిన ఇమేజీని నిలుపుకోలేకపోయింది. దీంతో తెలుగు నుంచి ఇతర పరిశ్రమలకు వెళ్లిపోయింది. అక్కడ బాగానే ఉన్నా.. హఠాత్తుగా సినిమాలు మానేసింది.

1993లో ‘చిన్న జమీన్‌’ అనే తమిళ చిత్రంతో పరిచయమైన వినీత… ఆ తర్వాత 1996లో ఈవీవీ కంటపడి ‘ఇంట్లో ఇల్లాలు..’ సినిమాలో నటించింది. ఆ తర్వాత మరో రెండు తెలుగు సినిమాలు చేసింది. కానీ అవేవీ ఆమెకు హిట్‌ ఇవ్వలేదు. దీంతో హిందీ, కన్నడ, మలయాళం సినిమాలు చేసుకుంది. ఆఖరిగా 2009లో వినీత ‘ఎంగ రాశి నల్ల రాశి’ అనే తమిళ సినిమా చేసింది. ఆ తర్వాత వెండితెరవైపు చూడలేదు. ఇక పై ఫొటో అంటారా… ప్రముఖ నిర్మాత డైమండ్‌ బాబు తనయుడు వివాహానికి వచ్చినప్పుడు తీశారు.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus