Venkatesh: ‘ఎఫ్‌ 3’ తర్వాత వెంకటేశ్‌ చేయబోయే సినిమాలివే!

సెట్స్‌ మీద సినిమా ఉండగానే మరో సినిమా ఓకే చేసేస్తున్నారు మన హీరోలు. ఇంకొందరు అయితే రెండు, మూడు సినిమాలకు పచ్చ జెండా ఊపేస్తున్నారు. అలా సీనియర్‌ స్టార్‌ హీరోల నుండి కుర్ర హీరోల వరకు అందరూ వరుస సినిమాలు చేసేస్తున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కోల్పోయిన కాలాన్ని, సినిమాల్ని కవర్‌ చేసేస్తున్నారు. అయితే అందరి సినిమాలు తెలుస్తున్నాయి కానీ, వెంకటేశ్‌ సినిమాల సంగతే తెలియడం లేదు. అయితే ఇప్పుడు వెంకటేశ్‌ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేశారు.

‘ఎఫ్‌ 3’ తర్వాత చేయబోయే సినిమాల వివరాలను వెంకటేశ్‌ ప్రకటించారు. ‘ఎఫ్‌ 3’ సినిమా ప్రచారంలో భాగంగా తన సినిమాల లైనప్‌ని అనౌన్స్‌ చేశారు వెంకీ. అయితే, ఇంకా దర్శకులను ఫైనలైజ్ చేయలేదట. నిర్మాణ సంస్థలను మాత్రం ఖరారు చేశారట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఒక సినిమా చేయనుండగా, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలో మరో సినిమా చేస్తున్నట్టు వెంకటేశ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరు దర్శకులను కన్ఫర్మ్ చేసే పనిలో ఉన్నారట.

మరోవైపు వెంకటేశ్‌ ‘రానా నాయుడు’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించారు. రానాతో కలసి వెంకీ.. నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఈ వెబ్‌ సిరీస్‌ చేశారు. కరోనా తొలి వేవ్‌ తర్వాత ఈ వెబ్‌ సిరీస్‌ మొదలై, ఇటీవల పూర్తయింది. త్వరలోనే ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ ఉంటుందని సమాచారం. వెంకీని ఇప్పటివరకు చూపించని విధంగా ఈ సిరీస్‌లో పాత్ర ఉంటుందని చెబుతున్నారు. హిందీ, ఇంగ్లిష్‌లో రూపొందిస్తున్న ఈ సిరీస్‌లో బూతులు కూడా ఉంటాయని ఆ మధ్య రానా చెప్పారు.

వెంకీ అంటే కూల్‌ అండ్‌ కామ్‌నెస్‌కి మారుపేరు. అలాంటి వెంకీ నుండి ఇలాంటి వెబ్‌ సిరీస్‌ రావడం అంటే కాస్త ఆసక్తికరమే. తెల్లటి జుట్టుతో వెంకీ లుక్‌ను సిరీస్‌ కోసం రిలీజ్‌ చేశారు. మరి సిరీస్‌ ఎలా ఉంటుందో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్‌, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో ఏది ముందు మొదలవుతుంది అనే విషయంలో స్పష్టత కూడా రావాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus