టాలీవుడ్‌లో బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన హీరోలలో విక్టరీ వెంకటేష్ (Venkatesh Daggubati) పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. తన నటనతో ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వెంకీ ముందు వరుసలో ఉంటాడు. 1992లోనే ‘చంటి’ మూవీతో టాలీవుడ్‌ను షేక్ చేసిన వెంకీ, అప్పట్లో 10 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి హీరోగా చరిత్ర సృష్టించాడు. రవిరాజా పినిశెట్టి (Ravi Raja Pinisetty) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లో బిగ్ హిట్ గా నిలిచింది. అప్పటి వరకు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మెప్పు పొందిన వెంకటేష్, ఆ తరువాత పలు సినిమాలతో మాస్ ఆడియెన్స్‌కు కూడా చేరువయ్యాడు.
‘చంటి’ విజయంతో వెంకీ కెరీర్‌లో ఊహించని మార్పు వచ్చింది. కుటుంబ కథా చిత్రాలకు బ్రాండెడ్ హీరోగా మారాడు. చంటి విజయంతో టాలీవుడ్‌లో 10 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో వచ్చిన ‘కలిసుందాం రా’ (Kalisundam Raa) మూవీతో వెంకటేష్ మరో రికార్డును సెట్ చేశాడు. ఉదయ్ శంకర్ (Udayasankar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మరింత దగ్గర చేసింది. టోటల్‌గా 25 కోట్ల గ్రాస్ వసూలు చేసి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో రికార్డుని చేరుకుంది.
వెంకటేష్ కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోనే తొలి 25 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమాగా ఇది నిలిచింది. ఇప్పుడు, సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) మూవీతో వెంకటేష్ కెరీర్‌లో మరో సరికొత్త రికార్డు మొదలైంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, టాలీవుడ్ సీనియర్ హీరోల్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలుస్తూ, రెండు వారాల్లోనే 250 కోట్లను దాటేసింది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 300 కోట్ల గ్రాస్ సాధించి, సీనియర్ హీరోల్లో వెంకటేష్ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
ఈ సక్సెస్‌తో వెంకటేష్ మార్కెట్ రేంజ్ మరింత పెరిగింది. టాలీవుడ్‌లో సీనియర్ హీరోల సినిమాలు సాధారణంగా 150-180 కోట్ల వరకూ మాత్రమే వసూలు చేస్తే, ‘సంక్రాంతికి వస్తున్నాం’ 300 కోట్ల క్లబ్‌లో చేరింది. ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ లభిస్తే రికార్డుల కొత్త మామూలుగా ఉండదని మరోసారి వెంకీ నిరూపించారు.