వెంకటేష్, నాగార్జున ఇద్దరూ టాలీవుడ్లో ఉన్న అగ్ర హీరోలు. సీనియర్ స్టార్ హీరోలు అయినప్పటికీ ఇప్పటికీ హిట్లు ఇస్తున్నారు. ఇప్పటి స్టార్ హీరోలకు పోటీ ఇస్తున్నారు.ఇద్దరికీ ఉన్న ఇంకో కామన్ పాయింట్ ఏంటి అంటే… ఫ్యామిలీ ఆడియన్స్ లో వీరిద్దరికీ మంచి క్రేజ్ ఉంది. వీళ్ళు ఎన్నో ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించారు. చెప్పాలంటే ఆ లిస్ట్ కూడా పెద్దదే. గతంలో దర్శకులు ఫ్యామిలీ సబ్జెక్ట్ లు చేయాలి అనుకుంటే ఈ హీరోలే ఫస్ట్ ఆప్షన్ గా భావించేవారు.
మొదట ప్రతీ దర్శకుడు వెంకటేష్ ను సంప్రదించేవారు. అలాగే ఓ దర్శకుడు రెండు సార్లు ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్టులు డిజైన్ చేసుకుని వెంకటేష్ ను సంప్రదించాడు. కానీ రెండు సార్లు కూడా వెంకీ నొ చెప్పాడు. దీంతో ఆ దర్శకుడు నాగార్జున ని సంప్రదించాడు. రెండు సార్లు కూడా వెంకీ కోసం అనుకున్న కథల్ని నాగ్ తోనే చేశాడు. అందులో ఒకటి హిట్ అయ్యింది.. ఇంకోటి ఫ్లాప్ అయ్యింది. ఆ సినిమాలే ఒకటి సంతోషం,
ఇంకోటి గ్రీకు వీరుడు(2013).దశరథ్ ఈ రెండు కథల్ని వెంకటేష్ కోసం రాసుకున్నాడు. సంతోషం టైంలో వెంకీ వసంతం, మల్లీశ్వరి వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అందువల్ల సంతోషం చేయలేకపోయాడు. నాగ్ ఈ మూవీ చేసి సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక గ్రీకు వీరుడు కథ కూడా మొదట వెంకీ వద్దకు వెళ్ళింది.
మిస్టర్ పర్ఫెక్ట్ తో హిట్ కొట్టి ఫామ్లో ఉన్న దశరథ్ … వెంకీ తో ఈ మూవీ చేద్దాం అనుకుంటే.. ఆ టైంకి వెంకీ మసాలా, షాడో వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ కథ కూడా నాగ్ చేయడం జరిగింది.కానీ సినిమా ఫ్లాప్ అయ్యింది.