Venkatesh Remuneration: ‘ఎఫ్3’ కి వెంకటేష్ రెమ్యూనరేషన్ ఎంతంటే..!

‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎఫ్3’. మరి కొద్దిరోజుల్లో అంటే మే 27న ఈ మూవీ విడుదల కాబోతుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ మూవీ ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా తెరకెక్కుతుంది. టీజర్, ట్రైలర్లు సినిమా పై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. అనిల్ రావిపూడి ఇప్పటివరకు తీసిన సినిమాలు అన్నీ హిట్లే కాబట్టి ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు.

ఈ మధ్యకాలంలో ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది కాబట్టి.. ‘ఎఫ్3’ కి జనాలు క్యూలు కట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇదిలా ఉండగా.. ఈ మధ్య కాలంలో వెంకటేష్ ఫుల్ ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. ‘బాబు బంగారం’ యావరేజ్ అనిపించుకుంది.. తర్వాత వచ్చిన ‘గురు’ హిట్ అయ్యింది. ‘ఎఫ్2’ బ్లాక్ బస్టర్ అవ్వగా ‘వెంకీ మామ’ కూడా హిట్ కమర్షియల్ సక్సెస్ అందుకుంది.

ఓటిటి విడుదలైన ‘నారప్ప’ ‘దృశ్యం 2’ వంటివి కూడా మంచి ఆదరణ పొందాయి. దీంతో వెంకీ మామ ‘ఎఫ్3’ సినిమాకి పారితోషికం పెంచినట్టు తెలుస్తుంది. ‘ఎఫ్2’ చిత్రానికి గాను వెంకటేష్ రూ.5 కోట్లు పారితోషికం మాత్రమే అందుకున్నారట. ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యి భారీ లాభాలను ఆర్జించింది. దాంతో ‘ఎఫ్3’ కి వెంకీ ఇంకో రెండు రెట్లు ఎక్కువగా అంటే రూ.15 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్టు వినికిడి.

కామెడీ బ్యాక్ డ్రాప్లో వెంకీ మూవీ వస్తుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి థియేటర్లకు వస్తుంటారు. పైగా ఇది సమ్మర్ సీజన్ కాబట్టి.. ‘ఎఫ్3’ లో వెంకటేష్ కామెడీ కనుక పీక్స్ లో ఉంటే ఈ సినిమాకి కూడా కాసుల వర్షం కురవడం గ్యారెంటీ అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్లతో పాటు సోనాల్ చౌహాన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus