ఇది మరింత కిక్ ఇచ్చే న్యూసే..!

అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టారర్స్ వస్తాయా..? అప్పట్లో ఎన్టీఆర్,ఏ.ఎన్.ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలు మల్టీ స్టారర్లు చేసి.. అభిమానులను ఖుషీ చేయించారు. కానీ తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జగపతి బాబు, శ్రీకాంత్, వేణు, వడ్డె నవీన్ వంటి.. అప్పటి ‘టైర్ 2’ హీరోలు తప్ప .. చిరు, వెంకీ, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలు మాత్రం ఎటువంటి మల్టీ స్టారర్ సినిమాలు చెయ్యలేదు.

‘ఇద్దరి స్టార్ హీరోల ఇమేజ్ ను మ్యాచ్ చేసే కథ దొరకట్లేదు.. అభిమానులు శాటిస్ఫై అయ్యే కథ కావాలి లేకపోతే వారి మథ్య గొడవలు అవుతాయి.. అంటూ ఎస్కేప్ అయ్యారు. అయితే వెంకటేష్ మాత్రం మహేష్ తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా తీసి మల్టీ స్టారర్ ట్రెండ్ ను క్రియేట్ చేసాడు. ఆ తరువాత ‘మసాల’ ‘గోపాల గోపాల’ ‘ఎఫ్2’ వంటి మల్టీ స్టారర్ చిత్రాలు కూడా చేసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసాడు. ఇప్పుడు కూడా వరుణ్ తేజ్ తో ‘ఎఫ్3’ సీక్వెల్ ను చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఆ తరువాత నాని తో కూడా ఓ మల్టీ స్టారర్ చేయబోతున్నాడట.

త్రివిక్రమ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది. అటు తరువాత త్రినాథ్ రావు డైరెక్షన్లో వెంకటేష్ – సాయి ధరమ్ తేజ్ లతో కూడా ఓ మల్టీ స్టారర్ ఉండబోతుందని సమాచారం. మొత్తానికి మల్టీ స్టారర్ సినిమాలకు ‘కేర్ ఆఫ్ అడ్రెస్’ గా మారిపోయాడు వెంకటేష్. ‘ఆర్.ఆర్.ఆర్’ విడుదలయ్యే లోపు వెంకీ రెండు మల్టీ స్టారర్ సినిమాలు అయినా ప్రేక్షకులకు అందించే అవకాశం ఉందని తెలుస్తుంది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus