వరుస సినిమాలు ఒప్పుకోవడం ఒక లెక్క… ఆ సినిమాలు టైమ్ రిలీజ్ అవ్వడం ఇంకో లెక్క. ఈ సమస్య ఎక్కువగా చిన్న హీరోలకు వస్తుంటుంది. వరుసగా సినిమాలు చేసేసి, విడుదల దగ్గరకు వచ్చేటప్పటికి ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఒక అగ్రహీరోకు ఈ పరిస్థితి వస్తే ఏమవుతుంది. నెలల గ్యాప్‌లో సినిమాలు చేయాల్సి వస్తే ఏమవుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే విక్టరీ వెంకటేశ్‌వైపు చూస్తే అర్థమవుతుంది. ఇంతకీ ఏమైందంటే… వెంకటేశ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి.
‘ఎఫ్ 3’, ‘నారప్ప’, ‘దృశ్యం 2’. ఇందులో ‘ఎఫ్ 3’ తప్ప మిగిలిన రెండు సినిమాలు చివరిదశకొచ్చాయి. సినిమా షూటింగ్‌లు తిరిగి మొదలవ్వగానే ‘ఎఫ్ 3’ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తారట. కాబట్టి మూడు సినిమాలు దాదాపు సిద్ధమైనట్లే. ఇక వీటి విడుదల సంగతే పెద్ద ప్రశ్నగా మారింది. టాలీవుడ్‌లో విడుదలకు చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. అందులో వెంకటేశ్‌కు మూడు స్లాట్స్ కావాలి. ఒకవేళ వెంటవెంటనే రిలీజ్ చేసే పరిస్థితి ఉన్నా..
ఇప్పుడున్న థియేటర్ల విధానం, ప్రజల ఆలోచన ప్రకారం వరుసగా ఒకే హీరో సినిమాలు వచ్చేసినా అంత బాగుండదు. ఒకప్పుడంటే ఇలా వరుసగా సినిమాలు వచ్చేవి. ఈలెక్కన మరి వెంకటేశ్, సురేష్‌బాబు ఏం ఆలోచిస్తున్నారో తెలియాలి. ఒక్కోసారి వరుసగా సినిమాలు చేయడం మంచిది, ఇలా ఏదైనా అనుకోని అడ్డంకి వస్తే ఇబ్బందే.