అమెజాన్, నెట్ ఫ్లిక్స్, జీ5, సన్ నెక్స్ట్ ఇప్పుడు ఆహా. ఇలా డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలకు భారీ డిమాండ్ ఏర్పడింది. భవిష్యత్తు లో … డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలదే హవా… మహా అయితే సినిమా విడుదలైన వారం పాటు మాత్రమే సినిమా హడావిడి ఉంటుంది. అది కూడా సినిమా హిట్ అయితేనే…! మల్టీ ప్లెక్స్ లు పెరగడం మూలాన … సింగిల్ స్క్రీన్ లకు పెద్ద దెబ్బ పడుతుంది.వాటికి డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థలు కూడా తోడయ్యాయి. ఇక సింగిల్ స్క్రీన్ లకు కూడా చాలా వరకూ కాలం చెల్లిపోయినట్టే.
ఈ క్రమంలో వరుసగా వెబ్ సిరీస్ లలో నటించడానికి ఎంతో మంది చిన్న హీరోలు రెడీ అయ్యారు. నవదీప్, బిందు మాధవి, రమ్యకృష్ణ, శ్రీకాంత్ వంటి వారు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. బాలీవుడ్ లో అయితే కియారా అద్వానీ … రాధికా ఆప్తే వంటి వారు కూడా వెబ్ సిరీస్ లలో నటించి బాగా పాపులర్ అయ్యారు. అలా అని సినిమాల్లో వారి డిమాండ్ కానీ… క్రేజ్ కాని ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు సమంత, ప్రియమణి వంటి హీరోయిన్ లు కూడా వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు.
అయితే తెలుగులో మాత్రం ఇంకా స్టార్లు ఎవరూ కూడా వెబ్ సిరీస్ ల బాట పట్టలేదు. అయితే విక్టరీ వెంకటేష్ ముందుకొచ్చినట్టు తెలుస్తుంది. ఓ ఫ్యామిలీ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్ లో నటించడానికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇందుకు డైరెక్టర్ తేజ కథ సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది. మల్టీ స్టారర్ ల ట్రెండ్ ను మొదలుపెట్టిన వెంకటేష్.. వెబ్ సిరీస్ ల విషయంలో కూడా సరికొత్త ట్రెండ్ సృష్టిస్తాడేమో చూడాలి.
Most Recommended Video
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు…!
‘మహానటి’ లోని మనం చూడని సావిత్రి, కీర్తి సురేష్ ల ఫోటోలు…!