విక్టరీ వెంకటేశ్ (Venkatesh ) ఇప్పటికీ తన స్టామినాను బాక్సాఫీస్ వద్ద రుజువు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాతో భారీ హిట్ అందుకున్న వెంకీ, తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ప్లాన్ మార్చినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం వెంకటేశ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ చర్చల్లో ఉన్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ తన మార్క్ కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథను రెడీ చేశారని టాక్.
ఇందులో వెంకటేశ్ పాత్ర మరింత ఫన్ గా ఉండబోతుందట. ఈ ప్రాజెక్ట్‌ను జూన్ 6న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, షూటింగ్ షెడ్యూల్ ఫిక్స్ చేసే దశలో ఉందని సమాచారం. ఇక సినిమాను చాలా తక్కువ నిర్మాణం ఖర్చులో ఫినిష్ చేయనున్నారట. ఈమధ్య కాలంలో త్రివిక్రమ్ మినీ బడ్జెట్ సినిమా ఇదే అవుతుందట.
అంటే అఆ సినిమా తరువాత వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాలు చేసిన మాటల మాంత్రికుడు ఈసారి సేఫ్ జోన్ లో నాన్ థియేట్రికల్ బిజినెస్ తోనే సేఫ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ విషయంలో రుక్మిణి వసంత (Rukmini Vasanth) పేరు చక్కర్లు కొడుతోంది. ‘సప్త సాగరాలు’ (Sapta Sagaralu Dhaati) చిత్రంతో గుర్తింపు పొందిన ఈ కన్నడ బ్యూటీ, వెంకటేశ్ సరసన తొలిసారి స్క్రీన్ షేర్ చేయనుందన్న ఊహాగానాలు ట్రెండ్ అవుతున్నాయి. ఇక హీరో హీరోయిన్ న్యూ కాంబినేషన్ క్రేజ్ ఎలా ఉంటుందో చూడాలి.
రొమాంటిక్ టచ్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్‌ను హైలెట్ చేసేలా ఉండే కథ ఉంటుందట. త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీ (Allu Arjun) అట్లీ (Atlee Kumar) సినిమా పూర్తయ్యే వరకు ఏదో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అందుకే లైన్ లోకి వెంకీ ప్రాజెక్ట్ వచ్చేసింది. వెంకీ డేట్లు ఖరారవుతున్నాయి కాబట్టి, సినిమా సెట్స్‌పైకి రావడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.