Venkatesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’ కోసం వెంకటేశ్‌ను అలా మార్చిన భీమ్స్‌..!

హీరోలతో పాటలు పాడించడం అనేది కొత్త విషయమేమీ కాదు. చాలా ఏళ్లుగా మన స్టార్‌ హీరోలు పాటలు పాడుతూనే ఉన్నారు. కొంతమంది బిట్‌ సాంగ్‌ పాడితే, ఇంకొంతమంది పూర్తి సాంగ్‌ పాడేవారు. అయితే రీసెంట్‌ టైమ్స్‌లో ఇలాంటివి తగ్గుతూ వచ్చాయి. హీరోలు అందులోనూ సీనియర్‌ స్టార్‌ హీరోలు పాటలు పాడటం లేదు. పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan), తారక్‌ (Jr NTR) లాంటి వాళ్లు ట్రై చేశారు. అయితే ఇప్పటివరకు ఓ బిట్‌ సాంగ్‌ మాత్రమే పాడిన అనుభవం ఉన్న వెంకటేశ్‌  (Venkatesh) పూర్తి సాంగ్‌ పాడారు అని సమాచారం.

Venkatesh

తన కొత్త సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమా కోసం ఓ పాట పాడారట. ఫెస్టివల్‌ సాంగ్‌ ఒకటి ఇప్పుడు రామోజీ ఫిల్మ్‌ సిటీలో షూటింగ్‌ జరుపుకుంటోంది అనే వార్త చదివే ఉంటారు. మొత్తం టీమ్‌ మీద ఆ పాటను చిత్రీకరిస్తున్నారు. ఆ పాటను వెంకీనే పాడారట. ‘గోదారి గట్టు.. ’ అంటూ రమణ గోగులతో (Ramana Gogula) పాట పాడించి సినిమాకు మంచి హైప్‌ తీసుకొచ్చిన టీమ్‌.. ఇప్పుడు వెంకీతో పాట పాడించి ఇంకాస్త స్పెషల్‌ ఎలిమెంట్‌న జోడించింది అని చెప్పాలి.

వెంకటేశ్‌ (Venkatesh) ఇప్పటికే ‘గురు’ (Guru) సినిమాలో ఓ చిన్న బిట్‌ సాంగ్‌ పాడారు. దానికి ఆ రోజుల్లో మంచి స్పందన వచ్చింది కూడా. ఇప్పుడు ఫుల్‌ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంగ్లిష్ పదాలు, తెలుగు పదాలు మిక్సింగ్‌లో ఈ పాటను రూపొందించారని, అందుకే ఈ పాటకు వెంకీ వాయిస్‌ సెట్‌ అవుతుంది అని సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో (Bheems Ceciroleo) , దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi)  అనుకున్నారట.

అంతేకాదు ఈ పాటను వీలైనంత త్వరగా రిలీజ్‌ చేసి దానినే ప్రమోషన్‌ కంటెంట్‌గా వాడుకుందాం అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయబోతున్నారు. పదో తేదీన ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) రిలీజ్‌ చేసి.. మూడు రోజుల గ్యాప్‌ ఇచ్చి ఈ సినిమా పనులు షురూ చేయాలని దిల్ రాజు (Dil Raju) ప్లాన్‌ చేస్తున్నారు.

నాని పారడైజ్ లీక్స్.. ఆ రోల్ ఎవరిది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus