ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ‘సార్’ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది. సినిమా టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించడంతో సినిమా పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ప్రమోషన్లో భాగంగా ఈరోజు అంటే ఫిబ్రవరి 15న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ మాట్లాడుతూ ‘సార్’ సినిమా గురించి, త్రివిక్రమ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామి అన్న సంగతి తెలిసిందే.
వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ” ‘సార్’ పై చాలా నమ్మకంగా ఉన్నాం. మామూలుగా ప్రీమియర్లు వేయడానికి నిర్మాతలు ఇష్టపడరు. కానీ ఈ సినిమా ప్రీమియర్లు వేస్తున్నామంటే నిర్మాతకు మా సినిమాపై ఉన్న నమ్మకం ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. ‘తొలిప్రేమ’ తర్వాత నేను చాలా నమ్మకంగా ఉన్న సినిమా ఇది. ఇది ఒక వీకెండ్ మాత్రమే చూసే సినిమా కాదు.. కనీసం నాలుగు వీకెండ్ లు చూసే సినిమా. నేను నమ్మకంగా చెబుతున్నాను. ఈ సినిమా తెలుగులో కనీసం నాలుగు వారాలు, తమిళ్ లో కనీసం ఎనిమిది వారాలు ఆడుతుంది.
నాకు మ్యాథ్స్ నేర్పిన మంజుల మేడంకి, నాకు క్రమశిక్షణ నేర్పిన రామ్మూర్తి సార్ కి ధన్యవాదాలు. అలాగే సినిమాల్లో నాకు దర్శకులు మణిరత్నం గారు, త్రివిక్రమ్ గారు గురువులు. నేను వారి సినిమాలు చూసి స్ఫూర్తి పొందాను. నేను ఈరోజు ఇక్కడ ఉండటానికి కారణం త్రివిక్రమ్ గారు. ఆయన స్ఫూర్తితోనే నేను రైటర్ గా నా కెరీర్ ను మొదలుపెట్టాను. అలాంటిది ఈరోజు ఆయన సినిమాకి నేను దర్శకుడు కావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.
ధనుష్ గారు ఒక నాగస్వరం. ఎన్ని వాయిద్యాలు ప్లే అవుతున్నా.. ఒక్కసారి నాగస్వరం ప్లే అయితే.. మనకు నాగస్వరం మాత్రమే వినిపిస్తుంది. ధనుష్ గారు ఒక నాగస్వరం. ఆయన నటిస్తుంటే.. ఆయన ఒక్కడే కనిపిస్తాడు, ఆయన ఒక్కడే వినిపిస్తాడు. అలాంటి నటుడితో సినిమా చేసే అవకాశం రావడం గర్వంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.
అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!
వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!