Vennela Kishore: ‘ఇండియన్2’ లో విలన్ రోల్.. వెన్నెల కిషోర్ స్పందన ఇది!

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్’ కి సీక్వెల్ గా ‘ఇండియన్2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ‘లైకా’ సంస్థ నిర్మిస్తుంది. నిజానికి ఎప్పుడో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రానికి చాలా ఆటంకాలు రావడంతో వాయిదా పడింది. కొన్ని నెలల క్రితమే ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. 40 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మే,జూన్ నాటికి సినిమాని కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ భాగంగా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ను మొదలుపెట్టాలని శంకర్ భావిస్తున్నాడు.

2023 దీపావళి లేదా క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని పక్కా ప్లాన్ తో తిరిగి షూటింగ్ ప్రారంభించాడు. ఎప్పుడో రెడీ చేసుకున్న స్క్రిప్ట్ కాబట్టి.. పెద్దగా ఇబ్బంది లేదు. ఇక ‘ఇండియన్2’ లో టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ విలన్ గా నటించబోతున్నట్టు కథనాలు వినిపించాయి. మెయిన్ విలన్ గా లేక పార్ట్ టైం విలన్ గా వెన్నెల కిషోర్ కనిపిస్తాడంటూ ప్రచారం జరిగింది. కోలీవుడ్ మీడియానే ఈ వార్తలు పుట్టించడం గమనార్హం.

తాజాగా ఈ విషయంపై వెన్నెల కిషోర్ క్లారిటీ ఇచ్చాడు. ‘నేను ఇండియన్ 2 లోనూ నటించడం లేదు.. ‘పాకిస్తాన్3’ లోనూ నటించడం లేదు అంటూ చెప్పుకొచ్చాడు వెన్నెల కిషోర్. దీంతో ఎక్కువ డ్రాగ్ చేయకుండానే ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయ్యింది. ఇక కాజల్ అగర్వాల్,రకుల్ ప్రీత్ సింగ్,ప్రియా భవానీ శంకర్ వంటి భామలు ‘ఇండియన్2’లో నటిస్తున్నారు. అలాగే కీలక పాత్రల్లో బాబీ సింహా, సముద్రఖని కూడా నటిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus