Nidhhi Agerwal: రాజ శ్యామల పూజ చేసిన నిధి అగర్వాల్ .. పూజ వల్లే ఆఫర్లు వచ్చాయా!

ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. సినీ ప్రముఖుల ప్రమేయం లేకుండానే వారి జాతకాలు చెబుతూ, వారి జీవితంలో జరగబోయే సంఘటనల గురించి ముందుగానే వివరిస్తూ యూట్యూబ్ ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించారు వేణుస్వామి. ఆయన్ని ఇంటర్వ్యూ చేయని యూట్యూబ్ ఛానెల్ లేదంటే అతిశయోక్తి కాదు. ఆఖరికి శాటిలైట్ ఛానెళ్లలోనూ ఆయనతో చర్చా కార్యక్రమాలు జరిగాయి.వేణుస్వామికి కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలతో సంబంధాలున్నాయి. కొంత మంది సెలబ్రిటీలకు ఆయన పూజలు, యాగాలు చేశారు.

తాజాగా ఈ ఖాతాలో హీరోయిన్ (Nidhhi Agerwal) నిధి అగర్వాల్ చేరారు. హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్లో వేణుస్వామి రాజ శ్యామల పూజ నిర్వహించినట్టు సమాచారం. ఈ మేరకు నిధి అగర్వాల్‌‌తో వేణుస్వామి బృందం పూజ చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పింక్ కలర్ చుడీదార్ ధరించిన నిధి అగర్వాల్.. వేణుస్వామి బృందం చెబుతున్నట్టుగా వేదమంత్రాల నడుమ కలశానికి పూజలు చేశారు. నిధి అగర్వాల్ పక్కనే కూర్చొని వేణుస్వామి ఈ పూజ చేయించారు.

గతంలో రష్మిక మందనతో కూడా వేణుస్వామి పూజ చేయించిన విషయం తెలిసిందే. అయితే, వేణు స్వామి చేసిన పూజలు నిధి అగర్వాల్ విషయంలో పనిచేసినట్లే అనిపిస్తుంది. వాస్తవానికి రాజశ్యామల యాగం చేయకముందే ఈ సినిమాకు సంతకం చేసింది కానీ సినిమా కొన్ని కారణాలవల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమాలో అవకాశం దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ మాత్రం వాయిదా పడింది. ఇక ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు విడుదల చేస్తారు? అన్న విషయాలపై నిధి అగర్వాల్ కూడా కన్ఫ్యూజన్లో పడిందని చెప్పవచ్చు. అలాంటి సమయంలోనే పూజలను చేయడానికి సిద్ధమయ్యింది. ఇప్పుడు ఎలాగో వాటిని పూర్తి చేసింది కాబట్టి తాజాగా ఈమె మాలీవుడ్లో ఒక రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్న వార్త వైరల్ గా మారింది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus