వేణు తొట్టెంపూడి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘స్వయంవరం’ ‘చిరునవ్వుతో’ ‘హనుమాన్ జంక్షన్’ ‘పెళ్ళాం ఊరెళితే’ ‘కళ్యాణ రాముడు’ ‘ఖుషి ఖుషీగా’ ‘శ్రీకృష్ణ 2006’ ‘యమగోల మళ్ళీ మొదలైంది’ వంటి చిత్రాల్లో నటించి మంచి క్రేజీ హీరో అనిపించుకున్నాడు వేణు. కానీ అటు తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా సినిమాలకు దూరమయ్యాడు. దాదాపు 9 ఏళ్ళ గ్యాప్ తర్వాత ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ చిత్రంలో అతను సీఐ మురళి పాత్రలో అతను కనిపించబోతున్నాడు. 9 ఏళ్ళ తర్వాత ఇలాంటి చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు అంటే వేణు మంచి కథనే ఎంపిక చేసుకుని ఉంటాడు అనే నమ్మకం అందరిలోనూ ఉంది. ఇదిలా ఉండగా.. వేణు ఇన్నాళ్లు ఎందుకు సినిమాలకు దూరంగా ఉన్నాడు అనే ప్రశ్నకు సమాధానం ఘోరికింది. మరి అతని ఫ్యామిలీని వేణు ఎందుకు దూరంగా ఉంచుతున్నాడు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. అయితే దానికి పెద్ద రీజన్ లేదని వేణు చెప్పుకొచ్చాడు.
ఇక వేణు భార్య పేరు అనుపమ చౌదరి. వీరి రెండు కుటుంబాలకు బంధుత్వం ఉంది. కాబట్టి ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అది లవ్ మ్యారేజ్ అని కూడా అనుకోవచ్చు అని వేణు అన్నాడు. ఇక ఈ దంపతులకు ఒక పాప ఒక బాబు ఉన్నారు. వేణు భార్య అనుపమ యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ లో ఎంబీఏ పూర్తి చేసిందట. అలాగే ఇంటీరియర్ డిజైనింగ్లో ట్రైనింగ్ కూడా తీసుకుందట అనుపమ. ఇక వీరి వివాహం జరిగి 10 సంవత్సరాలు పైనే అయ్యిందట.
బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉండడం వలన సినిమాలకు దూరంగా ఉన్నానని… బిజినెస్ లో భాగంగా వివిధ ప్రదేశాలకు తిరగడం వలన కుదరలేదని చెప్పిన వేణు.. తన భార్య సపోర్ట్ వల్లనే బిజినెస్ ను, ఫ్యామిలీ ని మేనేజ్ చేయగలుగుతున్నట్టు తెలిపాడు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి తన భార్య ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ఉందని కూడా చెప్పుకొచ్చాడు వేణు.