Vettaiyan Collections: ‘వేట్టయన్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..?

‘జైలర్’ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు రజినీకాంత్ (Rajinikanth) . తాజాగా ‘వేట్టయన్- ది హంటర్’ తో (Vettaiyan) ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘జై భీమ్’ తో ఆకట్టుకున్న టి.జె.జ్ఞానవేల్ (T. J. Gnanavel) ఈ చిత్రానికి దర్శకుడు. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)  , ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil), రానా దగ్గుబాటి (Rana), రావు రమేష్ (Rao Ramesh) కూడా సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ (Anirudh Ravichander) సంగీతం దర్శకుడు. ‘మనసిలాయో’ సాంగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది.

Vettaiyan Collections

కానీ తెలుగు టైటిల్ లేకపోవడం వల్లో ఏమో కానీ… సినిమా ఆశించిన స్థాయిలో మొదటి రోజు కలెక్ట్ చేయలేదు. ఒకసారి ఫస్ట్ డే (Vettaiyan) కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.02 cr
సీడెడ్ 0.45 cr
ఉత్తరాంధ్ర 0.26 cr
ఈస్ట్ 0.13 cr
వెస్ట్ 0.11 cr
గుంటూరు 0.14 cr
కృష్ణా 0.20 cr
నెల్లూరు 0.07 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.38 cr

‘వేట్టయన్’ కి రూ.10.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.11 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమా కేవలం రూ.2.38 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కి మరో.8.62 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి.. రెండో రోజు నుండి పికప్ అవుతుందేమో చూడాలి.

‘దేవర’ 2 వారాల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus