విక్కీకౌశల్ తీసుకున్న ఇంటి రెంట్ ఎంతో తెలుసా..?

ముంబైలో ఒకే అపార్ట్మెంట్ లో రెండు సెలబ్రిటీ జంటలు కాపురం పెడుతున్నాయి. ఇప్పటికే భార్యాభర్తలైన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. త్వరలోనే జంట కాబోతున్న కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ లు ఒకే అపార్ట్మెంట్ లో కాపురం పెడుతున్నాయి. ఇప్పటికే ఆ అపార్ట్మెంట్ లో విరాట్, అనుష్కలు రెండు ఫ్లోర్లలో నివసిస్తున్నాయి. అదే అపార్ట్మెంట్ లో ఒక ఫ్లోర్ ను రెంట్ కి తీసుకున్నాడట విక్కీ కౌశల్. వివాహం తరువాత కత్రినా, విక్కీలు అక్కడే కాపురం పెట్టనున్నారట.

కత్రినా, విక్కీలు రెంట్ తీసుకున్నది ఎనిమిదో ఫ్లోర్. దాని రెంట్ నెలకు ఎనిమిది లక్షల రూపాయలతో మొదలవుతుంది. మూడేళ్లకు గాను వీరు అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సమాచారం. తొలి ఏడాది ఎనిమిది లక్షల రూపాయల చొప్పున రెంట్, ఆ తరువాత రెండో ఏడాదికి గాను నెలకు నలభై వేల రూపాయలు ఎక్కువ, ఆ తరువాత మూడో ఏడాది నెలకి నలభై వేల రూపాయల మొత్తాన్ని అదనంగా చెల్లించనున్నారట. ఈ మేరకు మూడేళ్లకు అగ్రిమెంట్ అని..

దీనికి గాను విక్కీ కౌశల్ కోటి డెబ్భై ఐదు లక్షల రూపాయల మొత్తాన్ని ఒకేసారి చెల్లించాడని రియాలిటీ సంస్థ ఒకటి సమాచారమిచ్చింది. నెలకి ఎనిమిది లక్షల రూపాయల రెంట్ ఉన్న ఆ ఫ్లోర్ చాలా లగ్జరీయస్ గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నెలలోనే కత్రినా-విక్కీల పెళ్లి రాజస్థాన్ లో పేలస్ లో జరగనుంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus