టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరోగా విక్టరీ వెంకటేష్ పేరు సంపాదించుకున్నారు. ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలతో పాటు కాన్సెప్ట్ కు ప్రాధాన్యత ఉండే పాత్రలను వెంకటేష్ ఎంచుకుంటున్నారు. ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించగల టాలెంట్ ఉన్న వెంకటేష్ ప్రస్తుతం నారప్ప, ఎఫ్ 2, దృశ్యం సీక్వెల్ దృశ్యం 2లో నటిస్తున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వెంకటేష్ తన గురించి, తన కుటుంబం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ గురించి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలోకి ఏదో వచ్చాను.. నటించాను.. ప్రేక్షకులు ఆదరించారని.. నాన్న, అన్నయ్యల నుంచి నూటికి నూరుపాళ్లు కష్టపడటం నేర్చుకున్నానని అన్నారు. చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ గా మార్చుకోవాలని తాను ఆలోచిస్తానని వెంకీ తెలిపారు. పిల్లలు తనలా ఆలోచిస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ తన ఆలోచనల ప్రభావం పిల్లలపై కొంతవరకు ఉంటుందని అన్నారు. పిల్లలపై తానేదీ రుద్దనని.. ఎవరి లైఫ్ ను వాళ్లే తెలుసుకోవాలని వెంకీ అన్నారు.
ఎవరి జీవితాన్ని వాళ్లే నడిపించుకోవాలని.. ఎవరి తప్పులను వాళ్లే తెలుసుకోవాలని.. నొప్పి లేకపోతే లైఫ్ విలువ తెలియదని.. తన పిల్లలు ఎంత ఉన్నా ఒదిగే ఉంటారని.. పిల్లలను క్రమపద్ధతిలో పెంచానని వెంకీ తెలిపారు. మనీ ఎప్పుడు తనను ఆకర్షించలేదని.. కెరీర్ ప్రారంభంలో కొంత డబ్బు ఉండాలని అనుకునేవాడినని.. ఇప్పుడు వచ్చేదంతా బోనస్ అని డబ్బు అవసరం కంటే తక్కువ ఉన్నా అవసరాన్ని మించి ఎక్కువ ఉన్నా ఇబ్బందేనని వెంకటేష్ తెలిపారు.
Most Recommended Video
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!