తమిళ్ తో పాటు తెలుగులో కూడా సూర్యకు మంచి మార్కెట్ ఉండేది. గతంలో సూర్య సినిమాలకు బయ్యర్లు 10కోట్ల పైనే పెట్టుబడికి పెట్టేవారు. వారు పెట్టిన పెట్టుబడికి సూర్య సినిమాలు మినిమం గ్యారెంటీ అన్నట్టు ఉండేవి. ఒకవేళ తమిళంలో సూర్య సినిమా ప్లాప్ అయినప్పటికీ… తెలుగులో మాత్రం ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యేవి. ’24’ ‘7 సెన్స్’ వంటి చిత్రాలు తమిళంలో ప్లాప్ అయినప్పటికీ తెలుగులో మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడమే కాకుండా మంచి లాభాలను కూడా అందించాయి.
‘గ్యాంగ్’ చిత్రం వరకూ సూర్య మార్కెట్ 8కోట్ల వరకూ ఉండేది. ఆ టైములో మరో తమిళ స్టార్ హీరో విజయ్ మార్కెట్ కనీసం 3 కోట్ల వరకూ కూడా ఉండేది కాదు. కానీ ఇప్పడు సీన్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. ‘ఎన్జీకే’ ‘బందోబస్త్’ వంటి చిత్రాలతో సూర్య మార్కెట్ ఇక్కడ బాగా దెబ్బ తినేసింది. ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమా హిట్ అయినప్పటికీ.. అది డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలవ్వడం వల్ల .. అలా కన్సిడర్ చేయలేము.
అయితే ‘పోలీస్’ ‘అదిరింది’ ‘సర్కార్’ ‘విజిల్’ ఇక ఇప్పుడు మాస్టర్ వంటి చిత్రాలతో విజయ్ మార్కెట్ ఏకంగా రూ.13 కోట్లకు చేరుకుంది. ఇంకా ‘మాస్టర్’ చిత్రం తెలుగులో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది.ఈ చిత్రం ఫుల్ రన్లో ఇక్కడ 15కోట్ల వరకూ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ పండితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ‘అదిరింది’ చిత్రాన్ని ఇక్కడ 4కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పుడు దానికి 3 ఇంతలు పైనే విజయ్ మార్కెట్ ఏర్పడటం విశేషం.మరి సూర్య ఇక నుండీ అయినా సూపర్ హిట్లు కొట్టి.. విజయ్ దూకుడికి అడ్డుకట్ట వేస్తాడేమో చూడాలి..!