టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో అతి తక్కువ సమయంలోనే హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒకరు. తాజాగా ఈయన లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా అభిమానులను నిరాశపరిచిందని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఈయన పేస్ హాస్పిటల్ లో జరిగిన ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ ఎన్నో ఆసక్తి కరమైన విషయాలను తెలియచేయడమే కాకుండా తన మరణాంతరం తన అవయవాలను దానం చేస్తున్నానని ప్రకటించారు. ఇలా విజయ్ దేవరకొండ అవయవాలను దానం చేస్తున్నారని తెలియజేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదు సంవత్సరాల క్రితం తన విషయంలో జరిగినటువంటి ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చారు. ఐదు సంవత్సరాల క్రితంనాన్న ఆరోగ్య పరిస్థితి బాగా లేనప్పుడు డాక్టర్ కోసం గూగుల్ వెతికాను ఆ సమయంలో నాకు ఫణి పరిచయమయ్యారు.
అప్పటినుంచి తనతో నాకు మంచి బాండింగ్ ఏర్పడిందని తెలిపారు.ఆ సమయంలో నాన్నకు అనారోగ్య సమస్యలు ఉండడంతో ఆయనకు సర్జరీ చేయాల్సి వచ్చింది ఇలా ఒక వైపు సర్జరీ నిర్వహించారు. మరోవైపు తనపై బిల్ స్ట్రెస్.అప్పుడు నా వద్ద డబ్బులు కూడా లేవు ఇన్సూరెన్స్ కూడా లేదు బిల్లు గురించి మనం మాట్లాడుకుందామని డాక్టర్స్ తో చెప్పా అప్పటినుంచి పేస్ హాస్పిటల్ తో తనకు మంచి అనుబంధం ఏర్పడిందని తెలిపారు. ఇక అవయవాలు కోల్పోయిన వారు డోనర్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు.
అయితే అవయవ దానం అనేది కేవలం పబ్లిక్ డోనర్స్ వల్లే సాధ్యమవుతుందని డాక్టర్లు చెప్పారు అందుకే నా అవయవాలు అన్నింటిని దానం చేస్తున్నానని ఈయన తెలిపారు.అయితే మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి వారు ఇలాంటి హాస్పిటల్స్ కి వెళ్లి పరీక్షలు చేయించుకోవడం కష్టతరమవుతుంది కానీ అప్పుడప్పుడు మన ఆరోగ్యపరీక్షలు చేయించుకోవడం ఎంతో మంచిది అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.