దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనేది పాత సామెత. లాక్ డౌన్ అయ్యేలోపు ఇల్లు సెట్ చేసుకోవాలి అనే కొత్త ఆచరణ పాటిస్తున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. కరోనా & లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలల నుంచి షూటింగులు లేవు. దాంతో ఇంట్లో ఖాళీగా ఉన్న విజయ్ ఏం చేయాలో పాలుపోక.. తన కొత్త బంగ్లాను తనకు ఇష్టమైనట్లుగా రీడెకరేట్ చేయడం మొదలెట్టాడు. కరెక్ట్ గా చెప్పాలంటే ఇంటీరియర్ డిజైనర్ అయిపోయాడన్నమాట.
ఇంట్లోని ప్రతి అణువును తన అభీష్టానికి తగ్గటుగా సిద్ధం చేసుకొంటున్నాడు. ఇకపోతే.. విజయ్ “ఫైటర్” చిత్రం మళ్ళీ సెట్స్ మీదకు వెళ్ళేది సెప్టెంబర్ తర్వాతేనని తెలుస్తోంది. ఒకపక్క పూరీ జగన్నాధ్ కథకు మెరుగులు దిద్దుతుండడం, మరోపక్క కరణ్ జోహార్ పలు సమస్యల కారణంగా లైమ్ లైట్ లో లేకుండాపోవడం అనేది “ఫైటర్” హిందీ రిలీజ్ కి అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి ఈ చిత్రంపై పూరీ కంటే విజయ్ చాలా ఆశలు పెట్టుకొన్నాడు.
మరి ఇల్లు చక్కబెట్టడం పూర్తయ్యాక విజయ్ తన కెరీర్ ను కూడా చక్కబెట్టుకుంటాడో లేదో చూడాలి. విజయ్ తో పాటు తమ్ముడు ఆనంద్ పరిస్థితి కూడా అలానే తయారయ్యింది. మనోడు రెండు సినిమాలు చేయడానికి అన్నీ సెట్ చేసుకొన్నప్పటికీ.. ఈ కరోనా కారణంగా ఆ ప్రొజెక్ట్స్ ప్రస్తుతానికి సైడ్ అయిపోయాయి.