విజయ్‌ కోసం పూరి వినాయకచవితి ప్లాన్‌

  • February 11, 2021 / 10:29 AM IST

పూరి జగన్నాథ్‌ – విజయ్‌ దేవరకొండల ‘లైగర్‌’ అప్‌డేట్స్‌ ఇప్పుడు వరుస కడుతున్నాయి. కరోనా – లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన సినిమా చిత్రీకరణ జోరందుకుంది. మొన్నీమధ్య టైటిల్‌ ప్రకటించిన టీమ్‌, ఇప్పుడు రిలీజ్‌ డేట్‌ కూడా ప్రకటించేసింది. విజయ్‌ దేవరకొండ పాన్‌ ఇండియా సినిమాకు పూరి జగన్నాథ్‌ అండ్ కో వినాయకచవితి ఫెస్టివల్‌ను వేదికగా చేసుకుంది. భారత్ మేం వచ్చేస్తున్నాం అంటూ సెప్టెంబరు 29న సినిమాను విడుదల చేస్తున్న ఈ రోజు చిత్రబృందం ప్రకటించింది.

పాన్‌ ఇండియా‌ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ‘లైగర్‌’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల తేదీని తెలియజేస్తూ రిలీజ్‌ చేసిన పోస్టర్లో విజయ్‌ దేవరకొండను బాక్సర్‌ లుక్‌లో కాకుండా.. సరదా కుర్రాడిలా చూపించారు. చేతిలో కర్రతో ఉత్సాహంగా ఆడుతున్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సారి పోస్టర్‌ కలర్‌ఫుల్‌ లుక్‌లో కాకుండా.. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌లో సిద్ధం చేశారు. మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘లైగర్‌’ కోసం బాక్సింగ్‌లో విజయ్‌ శిక్షణ కూడా తీసుకున్నాడు.

ఈ సినిమా కోసం విజయ్‌దేవరకొండ మేకోవర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంఇ. పొడవాటి జుట్టుతో.. విభిన్నంగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్‌ సరసన అనన్య పాండే సందడి చేయనుంది. ధర్మా ప్రొడక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. క్రాస్‌ బ్రీడ్‌ అప్‌డేట్స్‌ ఇప్పటి నుంచి తరచూ మనకు వినిపిస్తుంటాయి అన్నమాట. క్రాస్‌ బ్రీడ్‌ ఎవరా అని అనుకుంటున్నారా. సినిమా ట్యాగ్‌లైన్‌ అదే కదా.. ‘సాలా క్రాస్‌ బ్రీడ్‌’.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus