Vijay Devarakonda: ‘లైగర్‌’ ఫ్లో వాడేద్దామని విజయ్‌ ఫిక్స్‌ అయ్యాడట!

  • February 26, 2022 / 01:23 PM IST

ఒక సినిమా హిట్‌ అయితే… ఆ సినిమా ఫేమ్‌తో దూసుకుపోవాలని కోరుకోవడం సహజం. అయితే ఆ తర్వాత చేసే సినిమా అంతకుమించి ఉండాలి లేకపోతే అడ్డంగా దెబ్బ తింటారు. ఈ విషయం సినమా ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. సింగిల్‌ నైట్‌ స్టార్‌ అయిపోగానే… ఆ తర్వాత చేసే సినిమాలన్నీ భారీ స్థాయిలో ఉండాలని ప్రయత్నించి దెబ్బ తింటుంటారు మన హీరోలు. అలా ఇప్పుడు ‘పాన్ ఇండియా’ ఫీవర్‌ వచ్చేసింది. దీంతో ఇబ్బంది పడతారో, పెడతారో చూడాలి.

Click Here To Watch

‘లైగర్‌’ సినిమాతో త్వరలో పాన్‌ ఇండియా స్టార్‌ కాబోతున్నాడు విజయ్‌ దేవరకొండ. పూరి జగన్నాథ్‌ రూపొందిస్తున్నఈ సినిమా ఆగస్టు 25న విడుదల చేస్తున్నారు. కథ, దర్శకుడు, సినిమా నేపథ్యం, భారీ తారగణం, ప్రొడక్షన్‌ హౌస్‌… ఇలా అన్నీ భారీగా ఉండటంతో ఈ సినిమా విజయం పక్కా అనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఆ సినిమా ఫ్లోను ఉపయోగించుకొని ఆ వెంటనే మరో పాన్‌ ఇండియా సినిమా తీసేయాలని విజయ్‌ దేవరకొండ అనుకుంటున్నాడట.

గతంలో ప్రకటించిన లైనప్ ప్రకారం చూసుకుంటే విజయ్‌ నెక్స్ట్‌ మూవీ శివ నిర్వాణతో ఉండాలి. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కించాల్సి ఉంది. శివ నిర్వాణ స్టైల్‌లో లవ్‌ స్టోరీగా ఈ సినిమా రూపొందించే ఆలోచనలో ఉన్నారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా సాగుతున్నాయని టాక్‌. అయితే ఇప్పుడు ఈ సినిమాను పాన్‌ ఇండియా సినిమాగా మార్చాలని విజయ్‌ అనుకుంటున్నాట. అందుకు తగ్గట్టుగా సినిమాలో మార్పులు చేయాలని సూచించాడని టాక్‌.

‘లైగర్‌’తో స్టార్‌ హీరో అయ్యాక.. మార్కెట్‌ పెరిగితే ఓకే కానీ.. ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఇప్పుడే ఈ పాన్‌ ఇండియా గోల ఎందుకు అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ‘బాహుబలి’తో భారీ రేంజి ఫేమ్‌ సంపాదించుకున్న ప్రభాస్‌ ఆ తర్వాత చిన్న సినిమా ‘సాహో’ని పాన్‌ ఇండియా మూవీగా ఆల్టర్‌ చేశాడు. ఫలితం ఏమైందో తెలుసు కదా. సో రౌడీ… కాస్త చూసుకోవాలి. ఏదేమైనా పరిశ్రమ మంచి కోసమే కదా చెప్పేది.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus