విజయ్ దేవరకొండ, రష్మిక.. బాగా పాపులారిటీ పొందిన రూమర్డ్ కపుల్ అని అంతా భావిస్తారు. విడివిడిగా చూసుకుంటే వీళ్ళు పెద్ద స్టార్లు. పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. నార్త్ లో కూడా సూపర్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. గతంలో ఇద్దరూ ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ అనే సినిమాల్లో జంటగా నటించారు. వాస్తవానికి విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీ వాలా’ సూపర్ హిట్ సినిమా. ‘డియర్ కామ్రేడ్’ మాత్రం పెద్ద ప్లాప్ అయ్యింది.
అయినప్పటికీ చాలా మంది ‘డియర్ కామ్రేడ్’ గొప్ప సినిమాగా మాట్లాడుకుంటారు. అందుకు ప్రధాన కారణం.. విజయ్ – రష్మిక..ల కెమిస్ట్రీ వల్ల అని చెప్పాలి. ఆ సినిమా తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు అనే రూమర్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. గతేడాది నుండి చూసుకుంటే.. ఈ రూమర్స్ ఇంకా ఎక్కువయ్యాయి. ఎందుకంటే వీళ్ళు ఏ ఫోటోలు షేర్ చేసినా అందులో బ్యాక్ గ్రౌండ్ ఒకేలా ఉంటుంది. దీంతో ఈ రూమర్స్ ఇంకా ఎక్కువగా వినిపిస్తున్నాయి.
తాజాగా రష్మిక(Rashmika) ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఎల్లో శారీలో నుదుటిన బొట్టు పెట్టుకుని ఆమె చాలా క్యూట్ గా ఫోజు ఇచ్చింది. మరోపక్క విజయ్ దేవరకొండ కూడా తన లేటెస్ట్ ఫోటోని షేర్ చేశాడు. ఈ రెండు ఫొటోల్లో బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే ఉంది. ఇంకొంతమంది ఈ రెండు ఫోటోలు తీసుకున్నది విజయ్ దేవరకొండ ఇంట్లోనే అంటూ కామెంట్లు పెడుతున్నారు.